వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరగబడినరాత

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, July 12 2004

హైదరాబాద్‌:నీటి రాజకీయాలు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికితలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు,కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లో నీరుచేరకపోవడంతో జల రాజకీయాలుఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందుకాంగ్రెస్‌ రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోపెద్ద యెత్తున సాగునీటి కోసంఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో ఆపాత్రను తెలంగాణ రాష్ట్ర సమితిపోషించింది.

తెలుగుదేశం,భారతీయ జనత పార్టీలు ఇప్పటికే కృష్ణాడెల్టాకు నీరివ్వాలంటూ గొంతు పెంచాయి.కర్ణాటకపై ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి నుంచినీటిని విడుదల చేయించాలని ఆ పార్టీలుడిమాండ్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌నాయకులు కూడా కృష్ణా డెల్టాకు నీరివ్వాలనిడిమాండ్‌ చేస్తున్నారు. అయితేముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఏమీచేయలేని స్థితిలో వున్నారు. కృష్ణాడెల్టాకు నీరిచ్చే విషయమైచర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో ఏ నిర్ణయమూతీసుకోలేదు. మరో వారం రోజులతర్వాత సమావేశం కావాలనినిర్ణయించారు. సమావేశాలతో కాలంవెళ్లదీసే యత్నంలో రాజశేఖర్‌ రెడ్డిఉన్నట్లు అర్థమవుతోంది.

కృష్ణాడెల్టా అలా రగులుతుంటే రాయలసీమనాయకులు సాగు నీటి కోసం గళంఎత్తుతున్నారు. సాగు నీటి సమస్యపైచర్చించి ఆందోళన కార్యక్రమాన్నిరూపొందించుకునేందుకుతెలుగుదేశం నాయకులు ఈ నెలపదిహేడవ తేదీన కర్నూలు జిల్లానంద్యాలలో సదస్సు నిర్వహిస్తున్నారు.కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తేతెలంగాణ రాష్ట్ర సమితి నాయకులేకాకుండా రాయలసీమ నాయకులు కూడాతీవ్రంగా వ్యతిరేకించే సూచనలుస్పష్టంగానే కనిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు తెలుగుదేశంప్రభుత్వాన్ని మూడు వైపుల నుంచిమూడు ప్రాంతాల నాయకుల జలరాజకీయాలను నడిపినట్లే ఇప్పుడుతెలుగుదేశం, బిజెపి నాయకులునడపడానికిసిద్ధమవుతున్నారు.

దీన్నిపరిష్కరించి సజావుగా ముందుకుసాగడం రాజశేఖర్‌ రెడ్డిప్రభుత్వానికి కనాకష్టమేఅవుతుంది. తెలుగుదేశం, బిజెపిజలరాజకీయాలను అడ్డుకునేందుకు ఏవ్యూహం రూపొందించినా ఫలితాలుఇవ్వకపోవచ్చు.

Recent Stories
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X