వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆచితూచి అడుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, May 14 2004

హైదరాబాద్‌: గతంలో కాంగ్రెస్‌ప్రభుత్వాలు ఏ కార ణాల వల్ల భ్రష్టుపట్టిపోయాయో అటువంటివిపునరావృతం కాకుండా కొత్త ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కన్పిస్తోంది. తనపేషీ అధికారుల ఎంపికలో కూడా ఆయన ఆచితూచివ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోఅప్రధాన పోస్టులలో ఉండిపోయిన ఒక కులం అధికారులకుముఖ్య పదవులు వస్తాయన్న వూహాగానాలు పూర్తిగా నిజం కాదనితెలుస్తోంది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌అధికారి రమాకాంతరెడ్డిని నియమిస్తారని వచ్చిన వార్తలు నిజంకావని జన్నత్‌ హుస్సేన్‌ నియామకంతో తేలిపోయింది.

నగర పోలీసు కమిషనర్‌ గా దినేష్‌రెడ్డి వస్తారని దినపత్రికలు ప్రముఖంగా వార్తా కథనాలుప్రచురించాయి. ఈ వార్తలు రాజశేఖరరెడ్డికి చికాకుతెప్పించాయి. మిమ్మల్ని కమిషనర్‌ గా వేస్తున్నట్టు మీకుచెప్పానా? ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అని దినేష్‌ రెడ్డినిముఖ్యమంత్రి నిలదీసినట్టు తెలిసింది. ప్రింట్‌ మీడియా ఓవరాక్షన్‌కు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యమంత్రి కార్యాలయంలోముఖ్య ప్రజా సంబంధాల అధికారి నియామకం గురించి కూడా మీడియాలోఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోస్టుకు చంద్రబాబునాయుడి హయాంలో అనవసర ప్రాధాన్యం లభించింది. గతంలో ఏముఖ్యమంత్రీ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్లకు ఇంత ప్రాధాన్యంఇవ్వలేదు.

మంత్రివర్గంలో కూడా రెడ్లకు అధికప్రాధాన్యం ఇచ్చారన్న అపప్రద రాకుండా రాజశేఖరరెడ్డిజాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలుతెలిపాయి. కొన్ని ముఖ్యశాఖలను బలహీన వర్గాలకు ఇవ్వాలని ఆయనయోచిస్తున్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌పదవులను కూడా కులాన్ని బట్టి కాకుండా యోగ్యతను బట్టిఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నారు. హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X