వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Monday, April 05 2004

హైదరాబాద్‌: వైఎస్‌రాజశేఖరరెడ్డి జైత్రయాత్ర సోమవారం ప్రారంభమైంది.తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ విజయం కోసం ఆయన ఈ యాత్రచేస్తున్నారు. పార్టీలో తన ప్రాబల్యం తగ్గుతున్నట్టుఅన్పించినప్పుడల్లా ఆయన ఇటువంటి యాత్రలు చేయడంసర్వసాధారణం. గత ఏడాది పాదయాత్ర అటువంటిదే. ఇక దాసరినారాయణ రావు కాంగ్రెస్‌ రెండో జాబితా వచ్చిన తర్వాత పార్టీలోఉండేదీ లేనిదీ నిర్ణయించుకుంటానని చెబుతున్నారు. కాపులకు,బిసిలకు జనాభాను బట్టి సీట్లు కేటాయించాలని దాసరి వాదన దీనిపైఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే రాష్ట్రంలోకాంగ్రెస్‌ అంతరించిపోతుందన్న వాస్తవం రాజశేఖరరెడ్డికితెలుసు. ఐదేళ్ళ తర్వాత వచ్చే తదుపరి ఎన్నికల నాటికి వైఎస్‌రాజకీయాల్లో ఉండరు. అరవై ఏళ్ళ వయసుకు రాజకీయాలనుంచి విరమిస్తానని ఆయన ప్రకటించారు.

కాబట్టిరాజశేఖరరెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలు. ఆయన ముఖ్యమంత్రికావడానికి ఇదే ఆఖరు అవకాశం. ఇరవై ఏళ్ళ క్రితమేఆయన పిసిసి అధ్యక్షుడైనా ఆయన రాజకీయ కెరీర్‌ ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయింది. మధ్యలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా పివి, కోట్లఆయనను ఢిల్లీకి పరిమితం చేశారు. అతి చిన్న వయసులో పిసిసిఅధ్యక్షుడైనా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు.ఇప్పుడైనా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అధిష్టానవర్గంప్రకటిస్తే కాంగ్రెస్‌ విజయావకాశాలు మెరుగుపడతాయన్నవాదన ఉంది.

ఇక దాసరి నారాయణరావు సామాజికన్యాయం వాదన సమంజసంగానే ఉన్నా ఆయన చిత్తశుద్ధి మీదసందేహాలున్నాయి. ఆయనకు కాంగ్రెసు పార్టీ అన్ని అవకాశాలుకల్పించింది. తమ కులంవారు రాష్ట్ర జనాభాలో ముప్పై శాతం ఉన్నారనివారిలో అధికశాతం తన మాట వింటారని చెప్పి ఆయన కాంగ్రెసునుంచి రాజ్యసభ సభ్యత్వం పొందారు. ఇటీవల కాంగ్రెసుసభల్లోను ఆయనకు మంచి ప్రాముఖ్యం ఇచ్చారు.

దాసరి నారాయణ రావుకిఆయన కులంలో అంతపట్టు ఉంటే అశ్వనీదత్‌కు మద్దతుఇవ్వకుండా చిరంజీవిని ఆపి ఉండవచ్చు. ఒసి కాపులు ఎక్కువగాఉన్న ఉభయగోదావరి, క్రిష్ణ , గుంటురు జిల్లాల్లో తిరిగితెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన ఒక ప్రభంజనంతీసుకురావచ్చు. అయినా ఎందుకాయన ఢిల్లీలో ఉండిరంగయ్యనాయుడు తదితర కాపు నాయకుల టికెట్ల కోసంపైరవీలు చేస్తున్నట్టు? అవసమైతే కాంగ్రెసుకు రాజీనామాచేస్తానని బెదిరిస్తున్నట్టు?

  • హస్తవ్యస్ధం
  • చిరంజీవిరహస్య ఎజెండా?

    హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X