వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారువేషంలో వెళ్ళొచ్చు కదా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Thursday, June 03 2004

;?

YSRహైదరాబాద్‌: వారంలో రెండురోజుల పాటుప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటాననిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించడంలో ఆశ్చర్యంలేదు. పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇమేజినిఆయన పొందాలనుకోవడంలో అసమంజసం ఏమీలేదు. కానీ ఈ చర్యవల్ల ప్రజలకు చేకూరే స్పష్టమైన ప్రయోజనం ఏముంటున్నదిఆలోచించాల్సిన విషయం.

రాజశేఖరరెడ్డి పాదయాత్ర,జైత్రయాత్రల ద్వారా కొన్ని వేల కిలోమీటర్లు ప్రజల మధ్యప్రయాణించారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు.వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ రాష్ట్రంలో రైతులు, రైతుకూలీలు,నిరుద్యోగులు, నిరుపేద మహిళల బాధలు తెలియనిది ఎవరికి?రాజశేఖరరెడ్డికే కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వాస్తవాలుతెలుసు. ముఖ్యమంత్రిగా ముఖ్యమైన విధానాల గురించి నిపుణులతోక్షుణ్ణంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవలసిన రాజశేఖరరెడ్డిమళ్ళీ యాత్రలకు బయలుదేరడం సమంజసం కాదేమోనన్నఅభిప్రాయాన్ని సీనియర్‌ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలు అన్న తర్వాతఅవి ఎంత ఆర్భాటంగా జరుగుతాయో తెలిసిందే. అధికారులు,నాయకుల పద్మవ్యూహంలో ఉండే ముఖ్యమంత్రిని ప్రజలు కలవడంకష్టమే. మరి ఈ పర్యటనలు ఎందుకు? వ్యక్తిగత ప్రతిష్టపెంచుకోడానికా? వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకున్నా చంద్రబాబుపరిస్ధితి చివరికి ఏమయ్యింది?

సవాలక్ష సమస్యలున్న మన గ్రామాల్లోపర్యటించి ముఖ్యమంత్రులు కొత్తగా తెలుసుకునే విషయాలు ఏమీఉండవు. సంపద సృష్టించే మార్గాలను ముఖ్యమంత్రి ఆలోచించాలి.వ్యవసాయ ప్రధానంగా ఉన్న మన రాష్ట్రానికి అనువైనవిధానాల గురించి చర్చించాలి. హైదరాబాద్‌లో ఉండి ఈ పనులుచేయవచ్చు. సామాన్యుల బాధలను ఆయన స్వయంగాతెలుసుకుని హృదయ స్పందన పొందాలంటే పూర్వం రాజుల లాగామారువేషంలో గ్రామాల్లో పర్యటించడం సమంజసంగా ఉంటుంది.

  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X