సినారె పద్మవ్యూహంలోశేషేన్!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ 20-10-2005
హైదరాబాద్:రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఛాయలుకన్పిస్తున్నాయి. తమకు ఎటూ మంత్రిపదవులు రావన్నగట్టి నమ్మకానికి వచ్చిన పి.జనార్ధనరెడ్డివంటి వారు త్వరలో ఒక శిబిరంలో చేరే అవకాశముంది. తనఅనుకున్న వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నావాళ్ళకు పదవులు ఇచ్చి ప్రోత్సహించడంరాజశేఖరరెడ్డి ప్రత్యేకత. తానుపదవులకు దూరంగా 15 ఏళ్ళుకాలక్షేపం చేసినప్పుడు తనతోరెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న అందరినీ వైఎస్‌ఇప్పుడు పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు.దీనితో మొదటి నుంచి వైఎస్ వైరివర్గాలలో ఉన్న పిజెఆర్ వంటి వారికికాళ్ళూ చేతులూ ఆడని పరిస్ధితి ఉంది.ఇందిరాగాంధీ అధికారంలో ఉండి ఉంటేఇప్పటికి రాష్ట్రంలో కనీసం ఇద్దరుముఖ్యమంత్రులు మారి ఉండేవారు.ముఖ్యమంత్రులను తరచు మార్చేవిధానానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు దూరంగా వైఎస్ వంటిముఖ్యమంత్రులకు కలిసివచ్చింది.వైఎస్‌కు పూర్తి అధికారాలనుఅధిష్టానవర్గం దఖలు పరిచింది. అసమ్మతివాదులు వెనకా ముందూ ఆడడానికి ఇదేప్రధాన కారణం.
పి.జనార్ధనరెడ్డిదిమాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లిజనార్ధనరెడ్డి వర్గం.జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిహయాంలో వైఎస్ కాంగ్రెస్‌లో ఒకతిరస్కృతుడుగా ఉండేవారు. అయినాకొంత మంది ఆయనను అభిమానిస్తూ ఆయతో టచ్‌లో ఉండేవారు.నేదురుమల్లి,కోట్ల వర్గాల్లో గట్టి మద్దతుదారులుగాఉన్నవారి మీద వైఎస్‌కు ఇప్పటికీ తీవ్రమైన కసి ఉన్నట్టుకన్పిస్తోంది.అసమ్మతి శిబిరాలను ఎలా నడపాలో,ముఖ్యమంత్రులను ఎలా ఇబ్బందిలో పడేయాలోవైఎస్‌కు తెలిసినంతఇతరులెవరికీ తెలియదు. ఆయననిత్య అసమ్మతి వాదిగా ఉండేవారు. ఇప్పుడుతనకు వ్యతిరేకంగా అసమ్మతిశిబిరాలు రాకుండా ఆయన అధిష్టానవర్గంబూచిని చూపించి భయపెడుతున్నారు. అయినప్పటికీ అసమ్మతివాదులుడిన్నర్ రాజకీయాలు చాపకింద నీరులాసాగుతూనే ఉన్నాయి.
తెలంగాణకుచెందిన కొందరు శాసనసభ్యులువైఎస్‌ను ఇబ్బంది పెట్టడానికి కెసిఆర్‌తోరెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు వైఎస్ వ్యతిరేకంగాఉండడం వల్ల తెలంగాణ కాంగ్రెస్‌ఎమ్మెల్యేలకు, టిఆర్‌ఎస్ నాయకత్వానికిమధ్య సయోధ్య సహజంగానేఏర్పడింది. వైఎస్ నిరంకుశంగావ్యవహరిస్తున్నారని, ఆయన కోటరీ దారుణంగాఅవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందని చంద్రశేఖరరావుద్వారా కాంగ్రెస్ అధిష్టానవర్గం దృష్టికితీసుకెళ్ళడానికి తెలంగాణకాంగ్రెస్ నాయకులు కొందరుప్రయత్నిస్తున్నారు. వీరికి ఆంధ్రప్రాంతానికి చెందిన రాయపాటిసాంబశివరావు, బుచ్చయ్య చౌదరి వంటివారి మద్దతు ఉండడం విశేషం.అధికార కేంద్రానికి సమాంతరంగావ్యతిరేక గ్రూపులు బలపడడంరాజకీయాల్లో సహజమే.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications