వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజారాజ్యానికి పెద్ద దెబ్బ?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కామన్ సింబల్స్ (అభ్యర్ధులందరికీ ఒకే సింబల్) వచ్చే అవకాశం తక్కువని రాష్ట్ర ఎన్నికల అధికారి, సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ ఐవి సుబ్బారావు హింట్ చేయడంతో ప్రజారాజ్యం ముఖ్యుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. సుబ్బారావు చెబుతున్నదే నిజమైతే ఏం జరుగుతుంది? ప్రజారాజ్యానికి చెందిన అనకాపల్లి అభ్యర్ధికి విమానం చిహ్నం, ఆదిలాబాద్ అభ్యర్ధికి పార సింబల్ లభించవచ్చు. ఆ పరిస్ధితి వస్తే పార్టీ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. ఒక పార్టీ రిజిస్టర్ అయినంత మాత్రాన ఆ పార్టీ అభ్యర్ధులందరికీ కామన్ సింబల్ లభించాలన్న నియమం ఏదీ లేదని సుబ్బారావు నిన్న విలేకరుల సమావేశం సూచనప్రాయంగా తెలియజేశారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఈ మధ్య సందడి తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రమే పార్టీ ముఖ్యులు అక్కడ కనిపిస్తున్నారు. మామూలు కార్యకర్తలకు ఆ కార్యాలయంలో ప్రవేశించడం గగనమైపోతోంది. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎంతో ప్రచారంతో ఆ పార్టీలో చిరంజీవి సమక్షంలో చేరిన గౌతు లచ్చన్న కుమార్తె నిన్న ఆ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రోడ్ షోలపై హైకోర్టు స్టే విధించినప్పటి నుంచి చిరంజీవిలో ఉత్సాహం తగ్గిపోయినట్టు కన్పిస్తోంది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతి రోజూ విలేకరుల సమావేశం నిర్వహించిన చిరంజీవి ఇప్పుడు వాటి మీద కూడా అంత ఆసక్తి చూపుతున్నట్టు లేదు. అయితే ఇది తాత్కాలికమేనని, రోడ్ షోల మీద హైకోర్టు స్టే తొలగించిన తర్వాత మళ్ళీ చిరు ప్రభంజనం ప్రారంభమవుతుందని కొందరు ప్రజారాజ్యం నాయకులు చెబుతున్నారు. ఒక వేళ రోడ్ షోలను పూర్తిగా నిషేధిస్తే ప్రజలను కలుసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు తమ వద్ద ఉన్నాయని వారు అంటున్నారు.

వామపక్షాలు తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, టీఅర్ ఎస్ కూడా ఆ కూటమి వైపు మొగ్గు చూపడం ప్రజారాజ్యం పార్టీ నైరాశ్యానికి ప్రధాన కారణం. ఇప్పుడు కనీసం బహుజన్ సమాజ్ పార్టీతో నైనా జతకడదామని ప్రజారాజ్యం మేధావులు ఆలోచిస్తున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం బహు స్వల్పం. గతంలో మాయావతి స్నేహ హస్తం చాచినా చిరంజీవి స్పందించలేదు. సిద్ధాంతబలం లేకుండా, కేడర్ దన్ను లేకుండా కేవలం ఒక వ్యక్తి చరిష్మాతో ముందుకు సాగుతున్న ప్రజారాజ్యం పార్టీకి ఇటువంటి ఎదురుదెబ్బలు తగలడం సహజమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X