రోశయ్య క్యాబినెట్ లో చిరంజీవి

మంత్రివర్గంలో చేరడం ద్వారా పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీ క్యాడర్ ను నిలుపుకోవడానికి వీలవుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్రయోజనం చేకూరుతుందని సత్యానంద రావు అన్నారు. కాంగ్రెసుతో పొత్తు ఇరు పార్టీలకు ఉపయోగపడుతుందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉండడం ద్వారా పార్టీ క్యాడర్ ను నిలుపుకోవడానికి, పార్టీ కార్యకర్తలకు పనులు చేసి పెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వంలో చేరి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా పార్టీని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజారాజ్యం నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవి సోదరుడు నాగబాబు అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిలో విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా సమస్యలపై పోరాటం చేయాలనేది చిరంజీవి అభిమతంగా చెబుతున్నారు. ఏమైనా, చిరంజీవికి మంచిరోజులు వస్తాయా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications