రూటు మార్చిన చిరంజీవి

కాగా, ఇప్పుడు ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటే తప్ప పదవులు వరించేట్లు లేవనే ఉద్దేశంతో చిరంజీవి తన రూటు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి దగ్గర కావాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డి. శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ సీటును వరించిన తర్వాతనే ఆయన తన పద్దతి మార్చుకున్నట్లు చెబుతారు. ఎమ్మెల్సీ సీటును చిరంజీవి తన వర్గానికి చెందిన కోటగిరి విద్యాధర రావుకు ఇప్పించాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ, తానొకటి తలిస్తే పార్టీ అధిష్టానం మరోటి తలిచింది. ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాతనే కాంగ్రెసు అధిష్టానం డిఎస్‌ను ఎంపిక చేసిందని ఆయన ఓ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతారు.
తిరుపతిలో జరిగిన మీ సేవ పథకం ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్యమంత్రికి సన్నిహితం కావాలని భావిస్తున్న సూచనలు కనిపించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మీ సేవ ట్యాగ్ లైన్‌కు చిరంజీవి మార్పులు సూచించడం, ఆ మార్పులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో తన సలహాలు తీసుకోవాలని పరోక్షంగా చిరంజీవి ముఖ్యమంత్రికి సూచించడం ద్వారా తాను దగ్గర కావాలని అనుకుంటున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారని అంటున్నారు. ఏమో, ఇప్పటికైనా చిరంజీవిని ఏదైనా పదవి వరిస్తుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications