వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శక్తి, తీన్‌మార్‌లకు క్రికెట్ దెబ్బ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr NTR-Pawan Kalyan
క్రికెట్ ఫీవర్ సినిమా రంగాన్ని దెబ్బ కొడుతోంది. చిన్న చిత్రాలే పెద్ద చిత్రాలూ క్రికెట్ దెబ్బకు డీలా పడుతున్నాయి. గత ఫిబ్రవరి 19న ప్రారంభం అయిన ప్రపంచ కప్ ఏప్రిల్ 2న ముగిసింది. అయితే నలభై రోజులకు పైగా సినీ పరిశ్రమ ఢీలా పడిపోయింది. థియేటర్లలలో అరకొర జనం మాత్రమే కనిపించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని థియేటర్లలో క్రికెట్ ఫీవర్ కనిపించింది. ఎంతలా అంటే కొన్ని థియేటర్లు క్రికెట్ దెబ్బను తట్టుకోవడానికి చిత్రాల బదులు క్రికెట్‌ను ప్రసారం చేసే అంతలా. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలు థియేటర్లలో భారత్ పాక్ మధ్య జరిగిన సెమీ ఫైనల్, భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని థియేటర్లలో ప్రదర్శించాయి.

ప్రపంచ కప్ సందర్భంగా చిన్న చిత్ర నిర్మాతలు కొన్ని చిత్రాలను విడుదల చేసినప్పటికీ పెద్ద చిత్రాల నిర్మాతలు మాత్రం తమ తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు. పైనల్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ శక్తి పైన కూడా క్రికెట్ ప్రభావం కనిపించింది. ఏప్రిల్ ఒకటో తారఖున ఈ చిత్రం విడుదలయింది. రెండో తారీఖున ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కారణంగా శక్తి చిత్రానికి 2.5 కోట్ల నష్టం ఆ రెండు రోజులలో జరిగినట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగు చిత్రరంగం కాదు దేశంలోని అన్ని భాషల చిత్ర రంగాల పరిస్థితి ఇదే. ప్రపంచ కప్ ప్రభావం తెలుగు భారీ చిత్రం అయిన శక్తితో పాటు హిందీ చిత్రం తను వెడ్స్ మనుపై కూడా పడిందంట. ఇదివరకు క్రికెట్ ప్రచారం కోసం సినిమాను ఉపయోగించుకునే వారు. ఇప్పుడు క్రికెట్‌నే సినిమా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.

ఓ చిత్రం ఆడియోని క్రికెట్ వేదికగా చేసుకొని విడుదల చేశారు. అంతేకాదు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రం రా-వన్ చిత్రం ట్రైలర్సును కూడా అదే దారిలో విడుదల చేశారంట. అయితే మన దేశంలో క్రికెట్ పట్ల యూత్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే అది హద్దులు దాటింది. క్రికెట్ అంటే కేవలం సినిమాలే కాదు అత్యంత అవసరమైన పరీక్షలనే విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇక చిత్రరంగంపై ప్రభావం పడితే ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇంతకుముందు సినిమా తారలే సెలబ్రిటీలు, ఇప్పుడు క్రికెట్ ఓ సెలబ్రిటీగా తయారయింది. క్రికెటర్లకు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా ఇప్పుడు లేదనటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలు కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే.

కానీ క్రికెట్ ఉద్వేగ భరిత ఆట. సినిమా డబ్బుల ఖర్చు పెట్టి ఆనందించాల్సింది. కానీ క్రికెట్ డబ్బులు పెట్టకుండానే ఎన్నో రెట్ల ఆనందాన్ని అందించేది. క్రికెట్ కారణంగా కౌంటర్లు పూర్తిగా కళతప్పాయి. అయితే ప్రపంచ కప్‌తో ఈ సమస్య తీరలేదు. ఈ నెల 8నుండి ప్రారంభం అయ్యే ఐపిఎల్ మ్యాచ్‌ల కారణంగా క్రికెట్‌కు ఆ దెబ్బ కంటిన్యూ కానుంది. ఐపిఎల్ కూడా సుమారు యాభై రోజులు ఉంటుంది. దీంతో పెద్ద చిత్రాల నిర్మాతలు తలపట్టుకుంటున్నారు. శక్తితో పాటు పవన్ కల్యాణ్ తీన్‌మార్ చిత్రానికి ఐపిఎల్ దెబ్బ పడనుంది.

English summary
Cinema industry effected by Cricket tournaments. Major project films like Jr.NTR Shakti also effected by cricket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X