జగన్‌కు రోజా దూరమేనా?

వైయస్ జగన్ రోజాకు ప్రాధాన్యం తగ్గించినట్లు చెబుతున్నారు. పార్టీ కీలక భేటీ సందర్భంగా జరిగిన ఓ సంఘటన రోజాను అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు. జగన్ కీలక నేతలతో భేటీ సమయంలో రోజా బయటనే కూర్చోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అంతేకాకుండా, కడప ఉప ఎన్నికల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనలేదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఆమె ప్రచారం సాగించినట్లు చెబుతున్నారు. తనను సాధారణ కార్యకర్తగా కూడా జగన్ గుర్తించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలుగుదేశంలో ఉన్న రోజా వైయస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఆమె కాంగ్రెసులో చేరాల్సిన సమయంలో వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి బయటకు రాగానే చురుకైన పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. అయితే, క్రమక్రమంగా రోజాను జగన్ దూరం పెడుతూ వస్తున్నారని చెబుతున్నారు. రోజా తీరు జగన్‌కు నచ్చలేదని అంటున్నారు. గ్లామర్ ఉన్న నాయకులు ఎవరు కూడా పార్టీలో ఉండకూడదని కూడా జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications