లగడపాటి కోసం తెలంగాణపై రూటు మార్చిన జగన్?

YS Jagan
వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా తన రూటు మార్చినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల తననే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను ఆయన జిల్లాలోనే దెబ్బతీసే లక్ష్యంగా తన ఓదార్పు యాత్ర రూటును మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర అనంతరం జగన్ తెలంగాణ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారని పలువురు భావించారు. అందుకు మహబూబ్ నగర్ జిల్లా నుండి ఓదార్పును ప్రారంభించాలని జగన్ భావించినట్టుగా సమాచారం. కర్నూలు ఓదార్పు తర్వాత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్లిన జగన్ ఆ తర్వాత తన ఓదార్పు యాత్రను తెలంగాణ నుండి తాత్కాలికంగా విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.

అందుకు కారణం లగడపాటి రాజగోపాల్ అని సమాచారం. ఇటీవల నిత్యం తనపై విమర్శలు చేస్తున్న లగడపాటి పార్లమెంటు నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర చేపట్టి ఆయనకు షాక్ ఇవ్వాలని జగన్ వర్గం భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఈ నెల 15 నుంచి కృష్ణాలో ఓదార్పు యాత్ర చేపట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ఓదార్పు చేపడితే భారీగా నాయకులు, కార్యకర్తలు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీలో చేరతారని జగన్ వర్గం భావిస్తోంది. తద్వారా లగడపాటిని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రెండుమూడు సార్లు లగడపాటి జగన్ అనుచరులు తనను అడ్డుకున్న సమయాల్లోనూ అందుకు ధీటుగానే స్పందించారు. లగడపాటిని మానసికంగా దెబ్బతీయాలనే ప్రధానమైన వ్యూహంతోనే జగన్ మహబూబ్ నగర్ నుండి తన ఓదార్పును కృష్ణకు మళ్లించినట్లుగా పలువురు భావిస్తున్నారు.

అలాగే ప్రస్తుత తెలంగాణ ఉద్యమం తీవ్రత దృష్ట్యా తెలంగాణలో పర్యటించక పోవడమే ఉత్తమంగా కూడా జగన్ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మహబూబాబాదులో జగన్‌ను అడ్డుకున్న విషయాన్ని జగన్ వర్గం గుర్తుకు తెచ్చుకుంటోందని సమాచారం. తెలంగాణ తీవ్రత దృష్ట్యా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓదార్పు అక్కడ సరికాదని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ఓ ఖచ్చితమైన స్టాండ్ తీసుకునే వరకు అక్కడి జిల్లాల్లో ఓదార్పు కష్టమనే భావన జగన్ వర్గానికి చెందిన తెలంగాణ నేతల్లోనూ కనిపిస్తోందంట. గత ప్లీనరీ తర్వాత జగన్ వర్గం నేతలైన కొండా సురేఖ, గోనే ప్రకాశ రావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+