తెలం'గానం': సిఎంపై రూటుమార్చిన బొత్స

సకల జనుల సమ్మె తర్వాత అధిష్టానం తెలంగాణ నేతలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. త్వరలో ఉప ఎన్నికలు కూడా రానున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధిష్టానం ఆ ప్రాంతం పైనే దృష్టి సారించింది. ఇరవై రోజుల క్రితం చిరంజీవి వర్గాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అనుమతించిన హైకమాండ్ ఇప్పుడు ఇద్దరు తెలంగాణ మంత్రులను తీసుకునేందుకు అంగీకరించడం అందులో భాగమే. అదే సమయంలో ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉన్న అపప్రదను తొలగించుకునేందుకు కష్టమైనా నష్టమైనా కిరణ్‌నే తొలగించాలని భావిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురైతే శాసనమండలి సభ్యుడు డి.శ్రీనివాస్ వంటి తెలంగాణ నేతల వైపు దృష్టి సారిస్తోంది. డిఎస్ కూడా బొత్స సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ కలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఎం పీఠం కోసం కన్నేయడం సరికాదని బొత్స భావిస్తున్నారని అంటున్నారు.
పిసిసి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన పార్టీ పైన దృష్టి సారించింది లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పీఠంపై కన్నేసిన ఆయన అటువైపు ప్రయత్నాలు చేయడం మినహా పార్టీ బలోపేతానికి పెద్దగా చేసిందేమీ లేదని అంటున్నారు. ఇటీవల గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన పార్టీపై దృష్టి సారించి తన పదవిని 2014 వరకు కాపాడుకునే ప్రయత్నంలో పడ్డట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఆ ఎన్నికలలోగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన కమాండ్‌లోకి తీసుకు వస్తే పీఠమెక్కడం సులువవుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications