వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటు తెలంగాణ అటు జగన్ ఏమవుతుందో?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-K Chandrasekhar Rao
కాంగ్రెసు పార్టీ నేతలకు ఉప ఎన్నికల భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే మార్చి నెల 18వ తారీఖున తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఏం చేస్తుందోనన్న ఆందోళన అధికార పక్షంలో ఉందంట. ఓ వైపు తెలంగాణ ఆకాంక్ష మరోవైపు కొవ్వూరులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఉన్న సానుభూతి టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసులకు ఏ మేరకు లబ్ధి పొందగలవని లెక్కలు వేస్తున్నారట.

కోస్తాంధ్రలోని కోవూరులో వైఎస్‌పై ప్రజల్లో సానుభూతిని ఎలా అధిగమించాలన్నదానిపై మంత్రులు దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వెసులుబాటు లభించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ప్రచార షెడ్యూల్ ఖరారులో నిమగ్నమయ్యారు. అయితే, తెలంగాణలోని ఆరు స్థానాల్లో సెంటిమెంట్ అంశంపైనే మంత్రుల్లో అలజడి కన్పిస్తోంది. వీటిలో ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ స్థానాలు ప్రతిపక్షాలకు చెందినవి.

ఇక తమ చేతిలోని స్టేషన్‌ ఘన్‌పూర్, కొల్లాపూర్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించిన మహబూబ్‌నగర్ స్థానాల కైవసం పైనా దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొవ్వూరులో జగన్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నల్లపు రెడ్డి ఇప్పటికే ప్రచారంలోకి వెళ్లిపోయారు. నామినేషన్ల తర్వాతే పార్టీ శ్రేణుల్లో చలనం వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఉప పోరులో ఫలితాలు ప్రతికూలమైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఏ స్థానంలో ఉంటారోనన్న చర్చ కూడా జరుగుతోందంట.

English summary
It seems, Congress Party leaders is tension bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X