ఆసక్తికరం: రూ.500, రూ.1000 నోట్ల రద్దు వెనుక మరో కోణం!
పెద్ద నోట్లపై మోడీ సర్కార్ ఉద్దేశ్యం ఆసక్తికరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ టార్గెట్‌తో పాటు నగదు రహిత దిశగా భారత్‌ను అడుగులు వేయించే ఉద్దేమని అంటున్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయమై నరేంద్ర మోడీ సర్కార్ ఉద్దేశ్యం ఆసక్తికరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్లను పన్నెండు రోజుల క్రితం రద్దు చేశారు. నోట్ల రద్దు ద్వారా బ్యాంకుల్లో రూ.నాలుగు లక్షల కోట్లకు పైగా జమ అయింది. బ్యాంకుల నుంచి జనాలకు చేరిన సొమ్ము రూ.75వేల కోట్లకు కొంత ఎక్కువ. అంటే జమ అయిన డబ్బు కంటే విత్ డ్రా అయిన డబ్బులు చాలా తక్కువ.
ప్రధాని మోడీ అకస్మాత్తు ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనం పైన యుద్ధానికి కాబట్టి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇక్కడ మోడీ సర్కార్ డబుల్ ప్లాన్ వేసిందని అంటున్నారు.
అది ఒకటి నల్ల ధనం టార్గెట్. నగదు రహిత దిశగా భారత్‌ను అడుగులు వేయించే ఉద్దేశ్యం మరో కారణంగా చెబుతున్నారు. ఇందుకు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. ప్రజలకు కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దీంతో చాలామంది క్యాష్ లెస్ బాట పడుతున్నారు. నెట్ బ్యాంకింగ్‌ను, కార్డులను ఉపయోగిస్తున్నారు.

ఓ రకంగా రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నగదు లావాదేవీలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్ల ధనాన్ని నియంత్రించడం కీలకంగా చెబుతున్నారు.
రద్దయిన పాత రూ.500 నోట్ల సంఖ్య 1570 కోట్లు. అదే స్థాయిలో కొత్త 500ల నోట్లు ముద్రించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అంచనా. కొత్త 500 నోట్ల ముద్రణ ఈ నెల 10వ తేదీ నుంచే మొదలైంది.
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లలో పగలూ రాత్రి నోట్లు ముద్రించినా అవసరమైన మేరకు నోట్లు అందుబాటులోకి రావడంలో జాప్యం తప్పదు. ప్రభుత్వం అనుకుని ఉంటే రద్దు నిర్ణయం అమలులోకి వచ్చేనాటికే కావాల్సినన్ని కొత్త 500 నోట్లను ముద్రించి ఉండేదని, కానీ, దీని వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే నగదు రహిత భారత్ దిశగా అడుగులు కావొచ్చని అంటున్నారు.
గ్రామాల్లో మొత్తం నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి. పట్టణాలు, నగరాల్లోను చిన్న చిన్న దుకాణాల నుంచి మొదలు చాలా వరకు నగదు లావాదేవీలే జరుగుతాయి. కరెన్సీకి ఇబ్బంది అయితే కిందిస్థాయి మార్కెట్ ఇబ్బందులు పడక తప్పదని అంటున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications