ఉగ్రదాడి: ప్యారిస్‌కు ముంబై దాడులకు ఎన్నో పోలీకలు

ఢిల్లీ: ప్యారిస్‌లో ఐసిస్ ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 128 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 2008లో ముంబైలో ఉగ్రవాదులు చేసిన దాడికి, నేడు ప్యారిస్ దాడికి పోలిక ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

పారిస్‌ మారణకాండకు, 2008లో ముంబైలో జరిగిన విధ్వంసానికి ఎన్నో పోలికలున్నాయంటున్నారు. వినియోగించిన వనరులను, దాడి తీరును విశ్లేషించి చూస్తే ఈ సామీప్యత స్పష్టమవుతోంది. పలు బృందాలు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు చేసిన తీరు ముంబై విధ్వంసం శైలికి ప్రతిబింభమంటున్నారు.

ముంబై తరహా విధ్వంసాన్ని ఐరోపా వ్యాప్తంగా సృష్టించాలంటూ కొన్నేళ్ల క్రితం అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఇచ్చిన పిలుపును ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో జాతీయ భద్రతా కార్యక్రమం సారథిగా ఉన్న బ్రూస్‌ హాఫ్‌మన్‌ పేర్కొన్నారు.

ముంబైలో జరిగిన 2008 దాడుల తర్వాత అదే తరహా పరిస్థితి ప్యారిస్‌లో ఇప్పుడు కనిపిస్తోందని 'జాతీయ తీవ్రవాద వ్యతిరేక కేంద్రం' మాజీ సంచాలకులు మైఖేల్‌ లీటెర్‌ అన్నారు. తీవ్రవాద ముప్పు పట్ల పాశ్చాత్య దేశాల ధృక్కోణాన్ని పారిస్‌ దాడి పూర్తిగా మార్చేస్తుందన్నారు.

ముంబయి తరహా దాడులు జరగవచ్చన్న మన భయాలన్నీ నేడు నిజాలై కళ్లముందు నిలిచాయని వైమానికదళ జనరల్‌(విశ్రాంత) మైఖేల్‌ ఖైడెన్‌ పేర్కొన్నారు. 2008 నాటి ముంబై తీవ్రవాద విధ్వంసానికి ప్యారిస్‌ దాడి ఓ ప్రతిబింబమని నిస్సందేహంగా పేర్కొనవచ్చన్నారు.

Mumbai horror revisited: 26/11 pattern in Paris attacks

నేటి పారిస్‌ దాడికి, ముంబై తీవ్రవాద విధ్వంసానికి కచ్చితమైన పోలికలున్నాయని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్‌) మాజీ సారథి రఘువంశి శనివారం నాడు పేర్కొన్నారు. అసలు ప్యారిస్‌ దాడి వ్యూహానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికానప్పటికీ, ప్రాధమికంగా అందిన వార్తలను చూస్తుంటే ముంబై విధ్వంసంతో దగ్గర పోలికలున్నట్లు స్పష్టమౌతోందన్నారు.

భారత్‌లో అప్రమత్తం

ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌లో హై-అలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీ, ముంబైపాటు ప్రధాన నగరాల్లో శనివారం భద్రత కట్టుదిట్టం చేశారు. నిఘా విభాగం సమాచారం మేరకు ఢిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం, ప్రభుత్వ భవనాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే, మెట్రో, బస్‌స్టేషన్‌లలో భద్రత పెంచారు.

ప్రముఖ హోటళ్లు, మాల్స్‌, మార్కెట్‌ల వద్ద నిఘా ఉంచారు. లష్కరే తోయిబా, ఇండియన్‌ ముజాయిద్దీన్‌ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు దేశంలోని విదేశీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇజ్రాయిల్‌ పర్యాటకులు ఎక్కువగా వచ్చే యూదుల ప్రార్థనా స్థలాల వద్ద పోలీసు బలగాలను పెంచారు.

ప్రధాని మోడీ ఖండ

ప్యారిస్‌లో ఐసిస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వం పైన దాడి అన్నారు. ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి నిర్వచించాలని, అప్పుడే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నదెవరో, పోరాడేది ఎవరో తేలుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+