హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మళ్లీ: గవర్నర్‌గిరిపై కవిత ఆగ్రహం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్: హైదరాబాదు శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని, కేంద్ర మొండితనం వీడకుండా తాము కోర్టుకు అయినా వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు హెచ్చరించారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే... టీఆర్ఎస్ ఎంపీలు ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వైపు లోకసభలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగానే టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు.

హైదరాబాద్‌‍లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. తెరాస సభ్యుల నిరసనల మధ్య లోకసభలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. జీరో అవర్ లో టీఆర్ఎస్ సభ్యులకు ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించినప్పటికీ... టీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభ వాయిదా పడింది.

మరోవైపు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌ కు అప్పగించడాన్ని తెలంగాణ మంత్రివర్గం తీవ్రంగా తప్పుపట్టింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని నిర్ణయించింది. దీనిపై మరోమారు కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేలా ఉన్న కేంద్రం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా కూడా పోరాడాలని నిశ్చయించింది.

వినోద్ కుమార్

వినోద్ కుమార్

లోకసభ వాయిదా పడిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి తదితరులు.

వినోద్ కుమార్

వినోద్ కుమార్

లోకసభ వాయిదా పడిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి తదితరులు. గవర్నర్ గిరి పైన తెరాస ఎంపీలు ధ్వజమెత్తారు.

కవిత

కవిత

లోకసభ వాయిదా పడిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.

కవిత

కవిత

లోకసభ వాయిదా పడిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. హైదరాబాదు పైన గవర్నర్ గిరి వద్దని ఆమె అన్నారు.

English summary
Hyderabad under Governor's rule irks BJP. Telangana Rastra Samithi MPs fired at Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X