ముందే మేల్కొన్న ఫడ్నవీస్
పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆందోళన ఉధ్రుతం కావడంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ముందుగానే మేలుకున్నది.
ముంబై: పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆందోళన ఉధ్రుతం కావడంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ముందుగానే మేలుకున్నది. రూ.34వేల కోట్ల మేరకు రుణం మాఫీ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మరాఠా నేత శివాజీ పేరుతో రుణమాఫీ పథకానికి 'ఛత్రపతి మహారాజ్ కిసాన్ సమ్మాన్ యోజన' అని పేరు నిర్ణయించారు.
ఒక్కో రైతుకు రూ.1.5 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని, దీంతో దాదాపు 90 లక్షల మందికి లబ్ది చూకరుతుంది. 40 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలుగుతుందన్నారు. రుణాలను క్రమం తప్పకుండా గడువులోపు తిరిగి చెల్లించే రైతులకు ప్రోత్సాహం కోసం.. వారు చెల్లించిన రుణంలో 25 శాతాన్ని వెనక్కి ఇస్తామని తెలిపారు.

అందరి అభిప్రాయాలతో తీసుకుని రుణ మాఫీ అమలు: దేవేంద్ర ఫడ్నవీస్
అందరి అభిప్రాయాలు తీసుకొని రైతులకు రుణమాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గురువారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను సీఎం ఫడ్నవిస్‌తోపాటు మంత్రి పాటిల్ కలిసి రుణమాఫీ అంశంపై చర్చించారు. చివరకు విపక్షాల డిమాండ్‌కు అదనంగా మరో రూ.50 వేలు కలుపుతూ రూ.1.50 లక్షల రుణ మాఫీ అమలు చేయాలని ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం ముందు చూపుతో తీసుకున్నదేనని చెప్తున్నారు. మహారాష్ట్ర రైతులు.. తమ పంట రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో ఆందోళనకు దిగారు.

తొలుత రూ. లక్ష.. తాజాగా రూ.1.5 లక్షల రుణ మాఫీ
రైతుల ఆందోళనతో స్పందించిన 'మహా' ప్రభుత్వం తొలుత లక్ష వరకు రుణమాఫీని ప్రకటించింది. విధివిధానాల ఖరారుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికపై శనివారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత సవివర ప్రకటన చేశారు. ఐదెకరాలలోపు రైతుల రుణంలో లక్షన్నర పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. రుణ వాయిదాలను క్రమంతప్పకుండా చెల్లించే రైతులను ప్రోత్సహించేందుకు వారి రుణమొత్తంలో 25 శాతం లేదా రూ.25 వేలను ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఇప్పటికే బడ్జెట్‌లోటు 4 లక్షల కోట్లు ఉందని, మాఫీ కారణంగా తలెత్తే ద్రవ్యలోటును తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం ఫడ్నవీస్ వివరించారు.
దేశంలోనే భారీ రుణ మాఫీ అన్న ఫడ్నవీస్
తమ నిర్ణయం చరిత్రాత్మకమని, అపూర్వమైనదిగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. తాము ప్రకటించిన రుణమాఫీ దేశంలోనే భారీదని అన్నారు. రుణమాఫీ భారం తగ్గించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ నెల జీతాన్ని ప్రభుత్వానికి ఇస్తారని సీఎం తెలిపారు. కాగా, మహారాష్ట్ర రుణమాఫీ ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. రుణమాఫీలతో ఆర్థికవ్యవస్థ గాడి తప్పుతుందని వ్యాఖ్యానించారు.
రూ.4 లక్షల కోట్లకు చేరనున్న ద్రవ్యలోటు
ఇప్పటివరకు రూ.3.82 లక్షల కోట్ల ద్రవ్యలోటుతో మహారాష్ట్ర సతమతం అవుతున్నది. దీనికి తోడు రూ. 25 వేల కోట్ల మేరకు రుణాలపై వడ్డీ చెల్లిస్తున్నది. వచ్చే ఏడాది ద్రవ్యలోటు రూ. 4 లక్షల కోట్లను దాటుతుందని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర పూర్తిస్థాయిలో రుణ మాఫీ అమలుకు రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఏడో వేతన కమిసన్ సిఫారసుతో రూ.24 వేల కోట్లు అదనపు భారం పడుతుంది. ఎల్బీటీ రద్దుతో ప్రభుత్వంపై అదనంగా రూ.7000 కోట్ల భారం పడుతుంది. ఇక హైవేల్లో మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో ప్రభుత్వ ఖజానాకు రూ.7000 కోట్ల కోత పడనున్నది.
రుణ మాఫీపై బ్యాంకర్ల పెదవిరుపు ఇలా
2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమలుజేసిన రుణ మాఫీతో 12 - 13 లక్షల మందికి రూ.82 లక్షల రుణాలు మాఫీ అయ్యాయి. ఇండియన్ మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు, ఫస్ట్ ర్యాండ్ బ్యాంక్ ఇండియా చైర్మన్ దీపక్ ప్రేంబరాయెన్ మాట్లాడుతూ రుణాల మాఫీ అమలు సరి కాదని అన్నారు. భారతదేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం పంట రుణ మాఫీ పథకాలు అమలు చేయడం అలవాటుగా మారిందని చెప్పారు. పంట రుణాల మాఫీ పథకాలు బ్యాంకులకు మంచిది కాదని, బ్యాలెన్ షీట్లు లెక్క తప్పుతుందని హెచ్చరించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications