సొరంగం తవ్వి నగల షాప్‌లో చోరీ: భర్తపై కోపంతో పిల్లలకు విషం పెట్టిన స్త్రీ
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దొంగలు షాపు కింది నుంచి సొరంగం తవ్వి దొంగతనానికి పాల్పడ్డారు. జైకిసాన్ కాలనీలో ఉన్న సిరివి నగల దుకాణంలోలో దొంగలు సొరంగం తవ్వి షాపులోకి ప్రవేశించి రూ.3లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

భర్తపై ఉన్న కోపంతో పిల్లలకు విషమిచ్చిన తల్లి ఉదంతం రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో భర్తపై కోపంతో ఓ తల్లి తన కూతురు భూమిక (13), కుమారుడు సురేందర్ (11)లకు ఎలుకల మందు తాగించింది. దీంతో పిల్లల పరిస్థితి విషమంగా మారింది. పిల్లలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కిడ్నాప్ అయిన బాలుడు అవినాష్‌వర్మ కథ సుఖాంతం అయింది. విజయవాడలో అవినాష్ ఆచూకీ లభ్యం అయింది. పోలీసులు అవినాష్‌ను హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు. బాలుడి కిడ్నాప్ సుఖాంతం కావడంతో అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో కడుపు నొప్పి బాధ భరించలేక లావణ్య (16) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చిన్నారి శవంతో ధర్మా
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రేగళ్లలోని సిద్ధార్ధ స్కూలు ఎదుట చిన్నారి మృతదేహంతో బంధువులు ఆందోళన దిగారు. చిన్నారి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితంస్కూలులో జారిపడిన చిన్నారి ఇంద్రజ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.












Click it and Unblock the Notifications