ఫిన్ అలెన్ రికార్డ్ సెంచరీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు విభాగాల్లో తేలిపోయింది. ఫిన్ అలెన్(33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 నాటౌట్) రికార్డ్ సెంచరీతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.మార్కో యాన్సెన్ వేసిన 13వ ఓవర్‌లో ఫిన్ అలెన్ వరుసగా 4, 4, 6, 6, 4 బాది 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు.
Video Published On: Wednesday, Mar 04, 2026, 11:34 [IST]


Click it and Unblock the Notifications