World War 3: Israel vs Iran War.. అమెరికా- ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ షురూ
మొత్తం 30 నుంచి 40 ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఆ దేశాధ్యక్షుడి భవనం, సైన్యనాధికారుల కార్యాలయాలు/నివాసాలు, సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు.. ఇవన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ దేశాల గగనతలాన్ని మూసివేశారు. పౌర విమానాలేవీ కూడా అక్కడ తిరుగాడట్లేదు. టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించిన వెంటనే పైలట్లకు తక్షణమే హెచ్చరికలు జారీ అయ్యాయి. సైనిక విమానాల కోసం మాత్రమే గగనతలాన్ని తెరిచి ఉంచారు. టెహ్రాన్ నగర వీధులన్నీ కూడా చెల్లాచెదురుగా కనిపించాయి. జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడి వరకే పరిమితం కాలేదీ దాడులు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక నివాసం సమీపంలోనూ సంభవించాయి.
Video Published On: Saturday, Feb 28, 2026, 01:56 [IST]


Click it and Unblock the Notifications