వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైసిపి అధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్, ఇన్నాళ్లకు షర్మిల గుర్తొచ్చింది'

వైసిపి ప్లీనరీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆ పార్టీ అధినేత జగన్ పరిచయం చేశారు. దీనిపై టిడిపి నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి ప్లీనరీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆ పార్టీ అధినేత జగన్ పరిచయం చేశారు. దీనిపై టిడిపి నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా..జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా..

రాజకీయాలకు జగన్ పనికి రాడని, తాను అన్ ఫిట్ అని తెలిసే ఆయన తెరపైకి ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చారని విమర్శిస్తున్నారు. ఓ విధంగా ప్లీనరీ వేదికగా జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారని చెప్పవచ్చు.

జగన్ జైలుకు, ప్రశాంత్ కిషోర్ వైసిపి అధ్యక్షుడు

జగన్ జైలుకు, ప్రశాంత్ కిషోర్ వైసిపి అధ్యక్షుడు

వైసిపి ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ పరిచయం, ఆయనకు జగన్ ప్రశంసలపై మంత్రి జవహర్ వినూత్నరీతిలో స్పందించారు. గుంటూరులో జరిగింది వైసిపి ప్లీనరీ కాదని, అది ప్రశాంత్ కిషోర్ ప్రోమో అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, ప్రశాంత్ కిషోర్ పార్టీ అధ్యక్షుడు అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ నడుపుతున్న జగన్

కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ నడుపుతున్న జగన్

అమరావతిలో రాజధాని వద్దన్న జగన్ అదే ప్రాంతంలో ప్లీనరీ పెట్టడం ఎంత వరకు సమంజసమని టిడిపి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పార్టీని నడిపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టి అంతా సీఎం కుర్చీ పైనే ఉందని వమర్శించారు.

సీఎం కుర్చీ కోసమే జగన్ పాదయాత్ర

సీఎం కుర్చీ కోసమే జగన్ పాదయాత్ర

ముఖ్యమంత్రి పీఠం కోసమే జగన్ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. ఎటువంటి హామీ ఇచ్చి అయినా అధికారంలోకి రావాలనేది జగన్ తాపత్రయం అన్నారు.

ఫ్యామిలీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఫ్యామిలీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఇన్నాళ్లు జగన్‌కు తన ఫ్యామిలీ గుర్తుకు రాలేదని, ఇప్పుడు మాత్రం సీఎం కుర్చీ కోసం విజయమ్మ, షర్మిలను తీసుకు వచ్చారని బోండా ఉమ మండిపడ్డారు. పొర్లు దండాల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరని చెప్పారు. జగన్ చేయబోయేది పాదయాత్ర కాదని, జైలు యాత్ర అన్నారు.

 జగన్

జగన్

ప్రతి శుక్రవారం కోర్టులో సంతకాలు చేసే జగన్ నీతులు చెప్పడం గురువింద నీతిలా ఉందని వైసిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి విమర్శించారు. 11 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్‌కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

పదేళ్లు మంత్రిగా చేశారుగా..

పదేళ్లు మంత్రిగా చేశారుగా..

వైసిపి ప్లీనరీలో చంద్రబాబుపై జగన్, బొత్స సత్యనారాయణలు చేసిన విమర్శలు సరికాదని శోభ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించడం కోసమే ప్లీనరీ నిర్వహించారన్నారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన బొత్స తమ కుటుంబం ఆస్తులు పెంచుకోవడం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.

రోజా వల్ల స్త్రీజాతి గౌరవం పోయింది

రోజా వల్ల స్త్రీజాతి గౌరవం పోయింది

తెలుగు రాష్ట్రాల్లో తన బినామీల ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని శోభా హైమావతి ఆరోపించారు. సిబిఐ అధికారులు నార్కో టెస్టులు జరిపి బొత్స అక్రమాస్తుల చిట్టా విప్పాలన్నారు. రోజా వల్ల స్త్రీ జాతి గౌరవం పోయిందని, ఆమె వెకిలి చేష్టల వల్ల అసెంబ్లీ గౌరవం కూడా పోయిందని మండిపడ్డారు.

English summary
YSR Congress President YS Jagan Mohan Reddy has introduced Political Strategist, Prashant Kishor to the Party Leaders and Cadre in the Plenary. He introduced Prashant Kishore as the man who made Narendra Modi as the PM and Nitish Kumar as Bihar Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X