వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ యూ టర్న్ ఎందుకు తీసుకుందో చెప్పాలి: విజయ సాయి రెడ్డి

యూపీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా పైన కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఎన్డీయే ప్రభుత్వం దానిని నెరవేర్చకుంటే ఎలాగని, మంత్రివర్గం ఆమోదించిన దానిని అమలు చేయకపోవడం ఏమిటని విజయ సాయిరెడ్డి అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా పైన కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఎన్డీయే ప్రభుత్వం దానిని నెరవేర్చకుంటే ఎలాగని, మంత్రివర్గం ఆమోదించిన దానిని అమలు చేయకపోవడం ఏమిటని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి అన్నారు.

ఆయన సోమవారం రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా పైన ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఎందుకు యూ టర్న్ తీసుకున్నదో చెప్పాలని నిలదీశారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డీ చేశారు, ఇప్పుడు రావట్లేదు: చంద్రబాబును ఏకేసిన జగన్కిరణ్ కుమార్ రెడ్డీ చేశారు, ఇప్పుడు రావట్లేదు: చంద్రబాబును ఏకేసిన జగన్

ఫైనాన్స్ కమిషన్ సూచనలు మాత్రమే చేస్తుందన్నారు. వాటిని కేబినెట్ అమలు చేయవచ్చు లేదా చేయకపోవచ్చునని చెప్పారు. ప్రత్యేక హోదా పైన నిర్ణయం తీసుకోవాల్సింది ఫైనాన్స్ కమిషన్ కాదని చెప్పారు.

 Vijaya Sai Reddy

ప్రత్యేక హోదా అయిదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని ఆనాడు వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలోని ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు. హోదా సంజీవిని కాదని ఇప్పుడు వెంకయ్య, చంద్రబాబులు చెప్పడం విడ్డూరమన్నారు. ఏపీకి కచ్చితంగా హోదా ఇవ్వాలన్నారు.

వాటిని చూడండి: పవన్ కళ్యాణ్‌కు లోకేష్ కౌంటర్!, బాబుపై బాలకృష్ణవాటిని చూడండి: పవన్ కళ్యాణ్‌కు లోకేష్ కౌంటర్!, బాబుపై బాలకృష్ణ

విభజనకు ముందు కాంగ్రెస్, విభజన తర్వాత బీజేపీ లూప్ హోల్స్‌ను చూపించి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రలోభాలతో విలువలను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
YSR Congress Party MP Vijaya Sai Reddy raises Special Status issue in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X