ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ జోరుతో ఏఐ టూల్స్ వాడకం కూడా బాగా పెరుగుతోంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా కనిపించే టూల్స్, తమ పని సులువు చేసే టూల్స్ ను వాడేస్తున్నారు. అయితే ఇదంతా వ్యక్తిగతంగా అయితే ఒకే. కానీ కంపెనీల్లో ఉద్యోగులు ఇలా ఏఐ టూల్స్ ను విచ్చలవిడిగా వాడటం వల్ల వాటి బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మైక్రోసాఫ్ట్ (Microsoft) తమ ఉద్యోగులకు ఏఐ టూల్స్ (AI Tools) వాడకం నిబంధనల్లో సవరణలు చేసింది.
మైక్రోసాఫ్ట్ తన ఏఐ సేవల వినియోగంపై కీలక నిర్ణయాలను ప్రకటించింది. తన ఉద్యోగుల ఏఐ వాడకానికి బడ్జెట్ పరిమితులను విధించింది. ఇప్పటివరకు ఉద్యోగులు విపరీతంగా వాడిన ఖరీదైన ఏఐ టోకెన్ల స్థానంలో, ఓపెన్ ఏఐకి చెందిన తక్కువ ధర కలిగిన జీపీటీ-5.6 మోడల్‌ను కంపెనీలో అంతర్గత అవసరాల కోసం సరికొత్త డిఫాల్ట్ ఆప్షన్‌గా ఖరారు చేసింది. ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా టెక్నాలజీని వాడుకునేలా ప్రోత్సహించడమే ఇందుకు ప్రధాన కారణం. మైక్రోసాఫ్ట్ కోర్ ఏఐ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జే పారిఖ్ పంపిన ఒక అంతర్గత ఈ-మెయిల్‌లో దీని గురించి స్పష్టత ఇచ్చారు.
కేవలం ఏఐ టోకెన్ల వినియోగం పెంచడం మాత్రమే ఉత్పాదకతకు కొలమానం కాదని, ఇతర ముఖ్యమైన వనరుల లాగే ఏఐ బడ్జెట్‌ను కూడా పొదుపుగా నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ఉద్యోగుల్ని కోరారు. కొత్త విధానంలో భాగంగా జులై నాటికి మైక్రోసాఫ్ట్‌లోని ప్రతి విభాగానికి ఒక స్పష్టమైన ఏఐ టోకెన్ బడ్జెట్ లక్ష్యాన్ని కేటాయించారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఏఐ ఖర్చులను సులభంగా తెలుసుకోవడానికి వీలుగా ఒక అంతర్గత డ్యాష్‌బోర్డును కూడా ఏర్పాటు చేశారు. చిన్నపాటి పనులకు కూడా అత్యంత ఖరీదైన ఏఐ మోడళ్లను వాడటం వల్ల సంస్థపై భారీ ఆర్థిక భారం పడుతోందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం చెబుతోంది. గతంలోనూ మైక్రోసాఫ్ట్ సిబ్బంది ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ మోడళ్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంపెనీకి ఖర్చులు పెరిగాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా గతంలో ఈ ధోరణిపై మాట్లాడారు. తానే స్వయంగా టోకెన్లను విపరీతంగా వాడే టోకెన్‌మ్యాక్సర్‌గా మారిపోయానని ఆయన అంగీకరించారు. అయితే, సాధారణ సమస్యల పరిష్కారానికి పవర్‌ఫుల్ ఫ్రాంటియర్ మోడళ్లను ఉపయోగించవద్దని ఆయన ముందే ఉద్యోగులను హెచ్చరించారు.OpenAI: వైజాగ్ కు టీసీఎస్ గుడ్ న్యూస్..! ఓపెన్ ఏఐ డేటా సెంటర్..!
Microsoft Layoffs 2026: లేఆఫ్ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్..!