Microsoft Layoffs 2026: లేఆఫ్ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్..!

అమెరికా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. సంస్ధలో అమలు చేస్తున్న ఏఐ సాంకేతికత, ఇతర కారణాలను చూపి దాదాపు 5 వేల ఉద్యోగుల్ని తీసేసింది. అయితే అమెరికాలో ఇలా తొలగింపుకు గురైన ఉద్యోగులకు ఇచ్చే పరిహారంపై మైక్రోసాఫ్ట్ తాజాగా స్పష్టత ఇచ్చింది. దీంతో లేఆఫ్ నిరాశలో ఉన్న ఉద్యోగులకు కాస్త ఊరట దక్కినట్లయింది. వీరంతా కొత్త ఉద్యోగాలు వెతుక్కునే లోపు ఈ పరిహారం వారికి ఉపయోగపడనుంది.

AI యుగంలో IIT డిగ్రీలు అవసరమా? మాజీ ఐఐటియన్ చెప్పిన అద్భుతమైన కారణం..!
AI యుగంలో IIT డిగ్రీలు అవసరమా? మాజీ ఐఐటియన్ చెప్పిన అద్భుతమైన కారణం..!

మైక్రోసాఫ్ట్ తాజాగా తొలగించిన ఉద్యోగులకు గరిష్టంగా 39 వారాల మూలవేతనం పరిహారంగా ఇవ్వబోతోంది. సర్వీస్, ప్రస్తుతం వారు పనిచేస్తున్న హోదా ఆధారంగా ఈ కాలం నిర్ణయిస్తారు. స్టాక్ లు పొందుతున్న ఉద్యోగులకు వాటిని కూడా ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. అలాగే వారికి ఆరు నెలల పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనుంది. దీంతో పాటు ఆరు నెలల తర్వాత కూడా వారు వ్యక్తిగతంగా డబ్బులు కట్టి పొడిగించుకునే అవకాశం కూడా కల్పించనుంది.

Microsoft Layoffs 2026 Severance Package Details for Affected US Employees Revealed
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ మరో భారీ లేఆఫ్స్- వేల ఉద్యోగులకు షాక్..!
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ మరో భారీ లేఆఫ్స్- వేల ఉద్యోగులకు షాక్..!

లేఆఫ్ ఉద్యోగులకు కనీసం 60 రోజుల బేస్ పే లభిస్తుందని బిజినెస్ ఇన్ సైడర్ తెలిపింది. అప్పటివరకూ వారు మైక్రోసాఫ్ట్ పే రూల్ లోనే ఉంటారు. కంపెనీలో లెవెల్ 64 వరకూ ఉన్న ఉద్యోగులు తొలగింపుకు గురైతే వారికి ప్రతీ ఆరు నెలల సర్వీసులో ఒక వారం బేస్ పే పరిహారంగా ఇస్తారు. లెవెల్ 65 నుంచి 67 వరకూ ఉన్న ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలల సర్వీసులో రెండు వారాల బేస్ పే ను పరిహారంగా ఇస్తారు.లెవెల్ 68 నుంచి పైన ఉన్న ఎగ్జిక్యూటివ్ లకు మాత్రం ప్రత్యేక పరిహారం ప్యాకేజీ చెల్లిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+