Advertisement

మిథున రాశి వారికి 2017వ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం


మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము కా, కి, కు, ఖం, జ, చ్ఛా, కే, కో, హా అను అక్షరములలో ఒకటి అయినచో మీది మిధునరాశి.

కర్కాటక రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

1) 2017 జనవరి:

దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి శుభాశుభ మిశ్రమ ఫలితములు, తలంచిన కార్యములు ఆలస్యముగా నెరవేరుట, చేయు వృత్తి, వ్యాపారములలో లాభనష్టములు సమానముగా నుండుట, ఇంటిపట్టున స్థిరముగా వుండకపోవుట, తొందరపడుట, మానసిక వత్తిడి ఎక్కువగుట, బంధుమిత్ర సమాగమము, భార్యకు అనారోగ్యం, ధనవ్యయం.

2) ఫిబ్రవరి:

పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ఉద్యోగములో చికాకులు, అధికారుల వలన మాటలు పడుట, పనివారల వలన యిబ్బందులు, బంధుమిత్రులతో విరోధము, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు, విందు వినోదములలో పాల్గొనుట, శుభకార్య ప్రశంసలు, పుణ్యక్షేత్రములను సందర్శించుట, వ్యాపార వ్యవహార లాభం, శతృవులు మిత్రులగుట.

3) మార్చి:

ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధా ప్రయాణాలు చేస్తారు. గృహములో వివాహాది శుభకార్యములు జరుగుట, తలంచిన కార్యములు జయము, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, అధికారానుగ్రహం, స్త్రీ సౌఖ్యం, మధ్యవర్తుల ద్వారా కొన్ని పనులు నెరవేరుట, నూతన వస్తు వస్రాభరణములు కొనుట, దీర్ఘరోగములతో బాధపడుచున్నవారికి ఆరోగ్యము చేకూరుట, ఆదాయమునకు తగ్గ ఖర్చు

4) ఏప్రియల్:

మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, నూతన వస్తువులు సేకరించుట, తరచుగా ప్రయాణములు చేయుట, బంధువర్గములో విరోధములు, రాజకీయ వ్యవహారములందు జయము, వ్యాపారలాభం, ధనాదాయం, సంఘములో గౌరవము, పలుకుబడి, పాతబాకీలు వసూలగుట, సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి, దంపతులు కలిసిమెలిసి వుండుట, ఆరోగ్యము బాగుండుట, ఆకస్మికముగా దెబ్బలు తగులుట, పాదములకు గాయములు ఏర్పడును.

5) మే:

కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, అనవసర ధనవ్యయం, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట బంధువులు-మిత్రులతో అకారణ కలహములు, కర్ర, కత్తి మొదలగువాటి వలన దెబ్బలు తగులుట, ఎముకలు విరుగుట, సరుకులు నిలవ చేయుట వలన వ్యాపారస్తులకు అధికారుల వలన భయం, మనస్సుకు స్థిమితము లేకపోవుట. వైద్యము నిమిత్తము, మందుల కొరకు డబ్బు ఖర్చు.

Advertisement
Advertisement

6) జూన్:

ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మాటలు పడుట, స్థాన చలనములు, ఆకస్మిక కలహములు, మనస్సుకు ఆందోళన, భయం, వేళకు భోజనము చేయకపోవుట, శిరోబాధలు, వ్యాపారస్తులకు జాయింటుదార్లతో కలహములు, నూతన వ్యక్తులతో స్నేహలాభములు, అనుకున్న పనులు ఆలస్యముగా నెరవేరుట.

7) జూలై:

కొత్త వస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, గొప్పవారితో పరిచయములు, సంఘములో గౌరవము, పలుకుబడి క్రయవిక్రయలాభం, ధనాదాయం, అన్యస్త్రీ పరిచయం, ఇరుగు పొరుగు వారితో విరోధములు, వ్యసనముల యందు ఆసక్తి, చర్మ సంబంధమైన వ్యాధులు, నూతన విషయములు, శాస్త్ర సంబంధమైనవి తెలుసుకొనుటలో ఆసక్తి, అనారోగ్యం.

8) ఆగష్టు:

స్త్రీ సౌఖ్యము పొందుతారు. తలంచిన కార్యములు జయము, వ్యవసాయదారులకు లాభం, నూతన వస్తు వస్త్రలాభం, ధనలాభం, మధుర పదార్ధములు భుజించుట, దైవకార్యములలో పాల్గొనుట, భక్తి భావన పెంపొందుట, అధికారానుగ్రహం, భార్యా బిడ్డల వలన సుఖ, ఏ పనికైనా ఉత్సాహముతో ముందుకు వెళ్ళట, ప్రయత్న కార్యసిద్ధి, పనుల వత్తిడి వలన అప్పడప్పుడు శరీర ఆయాసం.

9) సెప్టెంబరు:

ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును అన్నదమ్ములతోను, బంధువులతోను సఖ్యత లేకపోవుట, కుటుంబ కలహములు, మనస్థిమితము లేకపోవుట, వ్యాపార-వ్యవహారములందు లాభము, తరచు ప్రయాణములు చేయుట, అధికారుల అండదండలు, చేయు కృషి ఫలించుట, ధనాదాయము బాగుండుట, అనారోగ్యం, నొప్పలు, బాధలు, జబ్బుపడుట.

10) అక్టోబరు:

దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, అనుకున్నపనులు నెరవేరుట, ధనధాన్యవృద్ధి, పూర్వీకుల, పిత్రార్జిత ఆస్తులు కలియుట, ధనలాభం, కుటుంబసౌఖ్యం, క్రయవిక్రయలాభం, రాబడికి మించిన ఖర్చులు, ఇతరులతో మాట్లాడుట వలన అపనిందలు, సంఘములో పలుకుబడి, బంధువులలో ఆధిఖ్యత, పేరు ప్రతిష్టలు సంపాదించుట, నీచ జన సహవాసములు, చోరభయం.

11) నవంబరు:

గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, విందు వినోదములలో పాల్గొనుట, సంతాన కుటుంబవృద్ధి, అన్ని రంగముల వారికి విజయము, లాభము, ధనాదాయము బాగుండుట, ఉన్నత పదవులు, చేయు కృషియందు అభివృద్ధి, హోదాగల వ్యక్తులతో స్నేహలాభములు, శరీర ఆరోగ్యము బాగుండుట.

12) డిశంబరు :

అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును. అధికారుల వలన భయం, ధన విషయములో యిబ్బందులు, అపనిందలు,బంధు మిత్ర కలహములు, పెంపుడు జంతువుల వలన మనస్సుకు ఆందోళన, తలంచిన కార్యములకు ఆటంకములు, మాట పట్టింపులు, విరోధములు, సుఖ సౌఖ్యములు లేకపోవుట, స్త్రీలతో విరోధములు. మిధునరాశి వారు అర్గాష్టమ గురుదోష పరిహారమునకు మాసశివరాత్రికి మరియు సోమవారం ఈశ్వరాభిషేకం, గురువారం శనగలు దానం చేయించాలి.

Read more about:

English Summary

Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Varshphalalu 2017 of your zodiac sign will help you. Year prediction of Gemini.
Read more...