MS Dhoni: ముంబై మ్యాచ్ లో ధోనీ ఆడతాడా? సీఎస్కే క్లారిటీ...!

కాలి గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీఎస్కే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) త్వరలోనే బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాడు. అయితే అతని ఫిట్ నెస్ పై ఇప్పటికీ అనుమానాలు ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆ రిస్క్ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో రేపు ముంబై ఇండియన్స్ తో జరిగే కీలక మ్యాచ్ కు అయినా ధోనీ మైదానంలో దిగుతాడా లేదా అన్న దానిపై సీఎస్కే క్లారిటీ ఇచ్చింది.

IPL 2026: CSK కెప్టెన్ మార్పు ? రుతురాజ్ స్ధానంలో ...!
IPL 2026: CSK కెప్టెన్ మార్పు ? రుతురాజ్ స్ధానంలో ...!

రేపు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ కు బరిలోకి దిగడంపై స్వయంగా ధోనీనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. రేపు వైద్య బృందం ధోనీ ఫిట్‌నెస్‌ను అంచనా వేయబోతోంది. ఆ తర్వాత మ్యాచ్ ఆడాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం ధోనీదే అని సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ ధృవీకరించారు. ధోనీ ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడా లేదా అనే దానిపై రేపు అతను, వైద్య సిబ్బంది కలిసి నిర్ణయం తీసుకుంటారని కోచ్ తెలిపాడు. నిన్న వాంఖడే స్టేడియంలో ధోనీ ఐపీఎల్ 2026లో తన తొలి వికెట్ కీపింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. 44 ఏళ్ల ధోనీ, పిక్క కండరాల గాయం నుండి కోలుకుంటున్నందున సీఎస్‌కే ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.

Will MS Dhoni Play vs MI CSK Bowling Coach Ends the Speculation With a Clear Answer
SRH కెప్టెన్ మార్పు లేదా ? కమ్మిన్స్ ఎంట్రీ వేళ బిగ్ ట్విస్ట్..!
SRH కెప్టెన్ మార్పు లేదా ? కమ్మిన్స్ ఎంట్రీ వేళ బిగ్ ట్విస్ట్..!

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోనీ తిరిగి వచ్చే తేదీని వెల్లడించనప్పటికీ, త్వరలోనే తిరిగి మైదానంలోకి వస్తాడని నిర్ధారించాడు. తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా ధోనీ పిక్క కండరం బెణికిందని, గాయం కారణంగా అతను కోరుకున్నంత సౌకర్యవంతంగా పరుగెత్తలేకపోయాడని తెలిపాడు. అప్పటి నుండి ధోనీ కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నామని, ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడన్నాడు. బహుశా, అతను తర్వాతి మ్యాచ్‌లో లేదా ఆ తర్వాత మ్యాచ్‌లో ఆడవచ్చన్నాడు. అతను ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగి వస్తాడని గైక్వాడ్ వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+