US-Iran Talks: ట్రంప్ కు ఇరాన్ ఝలక్- యుద్ధం ఆపేశాక ఇదే తొలిసారి..!

ఇరాన్ పై అమెరికా ప్రారంభించిన యుద్దం తాజాగా ముగిసిపోయినట్లే కనిపించి తిరిగి ప్రారంభమైంది. అయితే మళ్లీ అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. అయితే ఉన్నట్లుండి యుద్దాన్ని ఆపేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ తో చర్చలు (US-Iran Talks) జరుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కానీ ట్రంప్ వాదనను ఇరాన్ ఇవాళ తోసిపుచ్చింది. అంతే కాదు ఇలాంటి చర్చలు జరపడం తమ డీఎన్ఏలోనే లేదని తేల్చిచెప్పేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వాదనను టెహ్రాన్ ఇవాళ ఖండించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ దేశం అమెరికాతో ఎలాంటి చర్చలలో పాల్గొనడం లేదని, చర్చలను పునఃప్రారంభించాలని టెహ్రాన్ కోరిందన్న ట్రంప్ వాదన కూడా కరెక్ట్ కాదని తేల్చేసింది. అలా చేయడం తమ నైజం కాదని తెలిపింది. దానికి బదులుగా చర్చలను కోరింది అమెరికాయేనని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

Iran Denies Holding Talks with US Dismisses Trump s Claim Says It s Not in Our DNA

హార్ముజ్ జలసంధిలో పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఆ వ్యూహాత్మక జలమార్గం అన్ని వర్గాలకు పూర్తిగా మూసేసినట్లు ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ మరోసారి తెలిపింది. అలాగే ఎలాంటి చర్చలూ జరగడం లేదని తెలిపింది. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఘర్షణకు తాజాగా విరామం ఇచ్చినప్పటికీ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడం లేదని వెల్లడించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య యుద్దం నిలిచినా చర్చలు జరగడం లేదని తేలిపోయింది. మరి ఇది వ్యూహాత్మక విరామమా లేగ యుద్ద వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+