EC ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీఈసీతో విభేదిస్తున్న కమిషనర్లపైకి ఈడీ, సీబీఐ ?

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) సహా పలు అంశాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో ఎన్నికల సంఘంలోని మిగతా ఇద్దరు కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషీ విభేదిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ లో ఎన్నికల సంఘం పనితీరు ఇంత నాసిరకంగా ఉందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ నేపథ్యంలో సీఈసీతో విభేదిస్తున్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కేంద్రం టార్గెట్ చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆరోపించింది.

బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!
బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!

చాలా ఆందోళనకరమైన సమాచారం అందుతోందంటూ కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. సీఈసీతో విభేదిస్తున్న ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సన్నిహితులపై దాడులు చేయమని సీబీఐ, ఈడీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్‌తో కలిసి సంయుక్త పత్రికా సమావేశం నిర్వహించి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను నిస్సందేహంగా ఖండించి, కొట్టిపారేయాలన్న ఒత్తిడిని వారిద్దరూ ప్రతిఘటిస్తున్నారని మరో సంచలన విషయం బయటపెట్టారు.

CJP Alleges CBI ED Pressure on EC Members Amid Differences With CEC Decisions
సుప్రీం బెంచ్ లో చీలిక- కీలక పరిణామాలు..! ఈసీ వివాదాల వేళ మరో బిగ్ ట్విస్ట్..!
సుప్రీం బెంచ్ లో చీలిక- కీలక పరిణామాలు..! ఈసీ వివాదాల వేళ మరో బిగ్ ట్విస్ట్..!

గతంలో ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస విషయంలో కూడా ఇదే జరిగిందని సౌరవ్ దాస్ గుర్తుచేశారు. ఆయన రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడానికి ముందు, ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు పంపారని తెలిపారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది జంతర్ మంతర్ అనంతర భారతదేశమని, ఇటువంటి చట్టవిరుద్ధమైన, మోసపూరిత ఎత్తుగడలతో ప్రజలను మోసగించలేమనే విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని సౌరవ్ దాస్ చురకలు అంటించారు.

CJP Alleges CBI ED Pressure on EC Members Amid Differences With CEC Decisions
CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!
CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆయన రాజీనామా చేయాలని, ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపాలని, పార్లమెంట్ లో ఇప్పటికైనా సీఈసీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్లు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో కేంద్రం మూడేళ్ల క్రితం తెచ్చిన సవరణ చట్టం రాజ్యాంగ బద్దతపై సవాళ్లు లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్లపై ఎట్టకేలకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా రెండుగా చీలిపోయింది. ఈ చట్టం రాజ్యాంగ బద్దతను నిర్దారించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని ఓ న్యాయమూర్తి, వద్దని మరో న్యాయమూర్తి తీర్పులు రాశారు. చివరికి ఈ వ్యవహారాన్ని ఛీఫ్ జస్టిస్ నిర్ణయానికి వదిలిపెట్టారు.

ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?
ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+