మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు పేర్లు ఖరారు- వారి మాటకే మొగ్గు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా మూమునూరు, అదిలాబాద్ లోని విమానాశ్రయాలకు పేర్ల ఖరారు పైన చర్చ జరుగుతోంది. వీటి పైన పలువురు తమ సూచనలతో పాటుగా అభిప్రాయాలను వెల్లడించారు. ఈ పేర్ల ప్రతిపాదన సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. ప్రజల నుంచి వచ్చిన సూచనల పైన సమీక్ష చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ రెండు విమానాశ్రయాలను పేర్లను ఖరారు చేసింది. కేబినెట్ లో చర్చించి అధికారం గా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
సుదీర్ఘ కసరత్తు... అభిప్రాయ సేకరణ తరువాత వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురంభీం పేర్లు ఖరారు అయ్యాయి. రెండు పేర్లు కొలిక్కిరావడంతో సంబంధిత ఫైలును క్యాబినెట్ లో ప్రతిపాదించనున్నారు. అక్కడ ఈ అంశం పైన చర్చించి.. ఆమోదం తెలపనున్నారు. ఆ వెంటనే ఈ విషయాన్ని తెలుపుతూ అవే పేర్లను ఖరారు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాయనుంది. అక్కడి నుంచి కూడా ఆమోదం రాగానే రెండు ఎయిర్‌పోర్టుల పేర్లతో గెజిట్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తాజాగా ఏయిర్ పోర్టులపై నిర్వహించిన సమీక్షలోనే ఈ పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ఈ పేర్లపైనా కొద్దిసేపు చర్చ జరిగిందని సమాచారం.

మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం
ఏపీలో ఇటీవల ప్రారంభించిన బోగాపురం ఎయిర్‌పోర్టు అల్లూరి సీతారామరాజు పేరు, ఒర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లు పెట్టిన అంశం కూడా చర్చకు వచ్చింది. అదే తరహాలో తెలంగాణకు వచ్చే విదేశీయులకు, ఇతర దేశాల ప్రతినిధులకు కూడా తెలంగాణ చరిత్ర, ఆ పేర్లు కలిగిన వారు చేసిన కృషి, పోరాట పటిమ తెలియాలంటే వారి పేర్లే సరైనవన్న అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాణి రుద్రమ, కొమురంభీం పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. అయితే మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో సమ్మక్క-సారలమ్మ పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. మరింతగా చర్చించిన తరువాత తుది నిర్ణయం పైన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టుల రెండు డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ఎయిర్‌పోర్టుల డిజైన్లు అద్భుతంగా ఉండాలని, తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా ఆకృతులు ఉండాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications
