విద్యార్థులకు శుభవార్త.. మీ చదువులకు రూ.2లక్షల వరకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్న రిలయన్స్ ఫౌండేషన్!

బాగా చదువుకునే నిరుపేద విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. రిలయన్స్ ఫౌండేషన్ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడాది కూడా మంచి అవకాశం ఇస్తోంది. . 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.

పాఠశాల విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా
పాఠశాల విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా

దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువు కొనసాగించడానికి ఈ మద్దతు ఇవ్వనున్నారు. ఈ స్కాలర్‌షిప్ ప్రధానంగా బాగా చదివే పేద విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఆర్థికంగా కష్టపడుతున్న కుటుంబాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం రిలయన్స్ ఫౌండేషన్ బాసటగా నిలుస్తుంది.అయితే ఈ స్కాలర్ షిప్ పొందాలంటే ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

Student Visa: డిపెండెంట్ వీసాలు బంద్.. ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్
Student Visa: డిపెండెంట్ వీసాలు బంద్.. ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్
scholarship to students Reliance Foundation UG Scholarship 2026-27 Up to 2 Lakh last date october5th

అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఎంపికలో కొంత అదనపు ప్రాధాన్యత ఉంటుంది. BA, B.Com, B.Sc, B.Tech వంటి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు మాత్రమే ఈ స్కాలర్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపికైన విద్యార్థులకు ఈ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులు మరియు ఇతర విద్యా అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకుండా ఈ స్కాలర్‌షిప్ మంచి భరోసా ఇస్తుంది. దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

10వ మరియు 12వ తరగతి మార్కుల జాబితాలు, కాలేజీ ప్రవేశ ధృవీకరణ పత్రం, ఫీజు రసీదు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు అవసరం. అన్ని వివరాలు సరిగ్గా అప్‌లోడ్ చేయాలి. తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేయాలి. రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ప్రాథమిక వివరాలు నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్ టెస్ట్ మరియు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 5, 2026. గడువు దగ్గరపడుతున్నందున ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. ప్రతీ సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశం బాగా ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. సమయం దాటకముందే విద్య కోసం లక్ష్మిని ఆహ్వానించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+