స్లీపర్ బస్సులో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది సజీవదహనం

అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను మృత్యువు అగ్ని రూపంలో కబళించింది. గ్రేటర్ నోయిడాలోని జీవర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. బస్సు వేగంగా వెళ్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని బూడిద కుప్పగా మార్చేశాయి. ఊపిరాడని దట్టమైన పొగ, కంటికి కనిపించని ఆందోళన మధ్య చిక్కుకుని తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కిటికీల అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ఉరుకులు పరుగుల విన్యాసం

ప్రమాదం జరిగే సమయంలో బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల వేడికి, పొగ ఘాటుకు ఉలిక్కిపడి లేచారు. బస్ అంతా పొగతో కమ్ముకోవడంతో ప్రధాన తలుపు ద్వారా బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. ప్రాణాలు దక్కించుకోవడానికి కొందరు ప్రయాణికులు విండోలు పగలగొట్టి బయటకు దూకారు. ఒకరినొకరు తోసుకుంటూ ప్రాణభయంతో కేకలు వేయడంతో అక్కడ అత్యంత దయనీయ దృశ్యం కనిపించింది.

Horrific Bus Fire on Yamuna Expressway Near Jewar Airport Kills 9 Passengers Several Injured In UP
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి సీరియస్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి సీరియస్

"కాళ్లకు చెప్పులు కూడా లేవు.. ప్రాణ భయంతో పరుగెత్తాను"

ఈ భయంకర ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ఒక మహిళా ప్రయాణికురాలు ఆ రాత్రి ఎదుర్కొన్న ఘోరాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నేను పడుకుని ఉండగా ఎవరో గట్టిగా తలుపు బాదుతున్న శబ్దం వినిపించింది. కళ్లు తెరిచేసరికి బస్సు నిండా దట్టమైన పొగ కమ్ముకుని ఊపిరి ఆడటం లేదు. చేతికి దొరికిన ఫోన్ మాత్రమే పట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా పరుగెత్తాను. తోపులాటలో పడిపోతుంటే వెనుక ఉన్నవారు నెట్టేశారు, ఎవరో చెయ్యి పట్టుకుని బయటకు లాగడంతో ప్రాణాలు దక్కాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

13 మంది సజీవ దహనం, మార్కాపురంలో మృత్యుఘోష..
13 మంది సజీవ దహనం, మార్కాపురంలో మృత్యుఘోష..

ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి.. బాధితులకు తక్షణ సాయం ఆదేశం

యమునా ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన ప్రయాణికులకు తక్షణమే అత్యవసర వైద్య సదుపాయాలు అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను సీఎం కార్యాలయం ఆదేశించింది. బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+