The Paradise Movie Review: నాని 'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

The Paradise Movie Review: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' సినిమా వీరి కాంబినేషన్‌పై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

స్టోరీ
ఈ సినిమా స్టోరీ 'సవాల్' అనే అణచివేతకు గురైన ఓ గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. షికాంజా మాలిక్ (మోహన్ బాబు) అనే క్రూరుడైన నాయకుడి కింద ఈ తెగ ప్రజలు తమ ఉనికిని కోల్పోయి జీవిస్తుంటారు. ఈ క్రమంలో జడల్(నాని) అనే యువకుడు షికాంజా మాలిక్‌పై ఎలా తిరుగుబాటు చేశాడు? తన ప్రజలకు ప్రత్యేక గుర్తింపును, హక్కులను ఎలా తెచ్చిపెట్టాడనేదే ఈ సినిమా స్టోరీ.

The Paradise Movie Review Natural Star Nani and Srikanth Odela Mass Action Drama Hits Screens

ప్లస్ పాయింట్స్
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. కథానాయకుడి పుట్టుకకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కేఫ్‌లో వచ్చే ఫైట్ సీన్, అలాగే ఇంటర్వెల్ సీన్స్ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. మాస్ సీన్లలో ఆయన నటన, ఫైట్స్‌లో చూపించిన ఈజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జడల్ అనే పాత్రను అద్భుతంగా క్రియేట్ చేయడం.. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాతకాలపు రొటీన్ స్టోరీనే ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా స్టోరీలో ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా నిలించింది. నాని క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్ర కూడా హలంగా నమోదు కాకపోవడం నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ లాంటి నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం
అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లేలో బలం లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని డైలాగ్స్ సరిగ్గా వినబడవు.. ఎడిటింగ్ కూడా కాస్త జిగ్ జాగ్ గా అనిపిస్తుంది. ఓ సీన్ నుంచి ఇంకో సీన్‌కు అకస్మాత్తుగా మారిపోతుంటుంది. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా
ఓవరాల్‌గా 'ది ప్యారడైజ్' సినిమా మాస్ ఆడియన్స్‌కు, నాని అభిమానులకు ఓ ట్రీట్. మాస్ అభిమానులు మెచ్చే సినిమా.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+