అంకుల్స్, ఆంటీలు కంప్లయింట్ చేస్తూనే ఉంటారు: CJP

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రముఖ నాయకులు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సంతోషంగా పార్టీ చేసుకుంటూ డాన్సులు వేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీట్ పేపర్ లీక్ ఉదంతంలో అభ్యర్థుల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకునే వారు, మరోవైపు ఇలా వేడుకలు చేసుకోవడం వారి నైతికతకే సవాల్ అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

బీజేపీ తీవ్ర ఆగ్రహం.. "ఇదేనా మీ సానుభూతి?"

ఈ వివాదాస్పద వీడియోను సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. సీజేపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయగానే ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్ తదితరులు అత్యంత విలాసవంతమైన హోటల్లో విందు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. నీట్ వివాదంతో ఆవేదన చెంది ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు సీజేపీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అని పూనావాలా నిలదీశారు. బీజేపీ నేతలు దీనిని కపటత్వానికి, బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా అభివర్ణించారు.

BJP vs CJP Clash Controversy Erupts Over Viral Party Video in 5-Star Hotel After Pradhan s Resignation

జెన్ జీ గట్టి కౌంటర్.. "అంకుల్స్, ఆంటీలు..

ఈ విమర్శలపై సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ ఎక్స్ వేదికగా అంతే ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వానికి, మీడియాకు 'జెన్ జీ' మనస్తత్వం, భావజాలం అసలు అర్థం కావడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాము రోడ్డుపై కూర్చుని నిరసనలు తెలుపగలమని, కోల్డ్ కాఫీ తాగుతూ కూడా ఉద్యమాలు నడిపించగలమని వ్యాఖ్యానించారు. పూర్వకాలపు ఉద్యమాల రీతిలోనే తాము ఉండాలని భావించడం పొరపాటని స్పష్టం చేశారు. "ఇది ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఉన్న యువతరం. ఇంట్లో ఉండే అంకుల్స్, ఆంటీలు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.. కానీ మమ్మల్ని భరించక తప్పదు" అంటూ సీజేపీ వర్గాలు బీజేపీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాయి.

ఈ విలాసవంతమైన నిరసనకు నిధులేవి?..

ఈ అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ కూడా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ వీధులు కొన్ని రోజుల పాటు ఆందోళనలతో కకావికలమైన తర్వాతి రోజే, యంగ్ యాక్టివిస్టులు మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు ఇన్ని రోజులుగా సాగిన ఉద్యమానికి ప్రయాణ ఖర్చులు, హోటల్ వసతి, తిండి, సాంకేతిక పరికరాలు, ఇతర వసతుల కోసం వేల రూపాయలు ఎవరు సరఫరా చేశారు? ఢిల్లీని అశాంతికి గురిచేసిన ఈ ఉద్యమం వెనుక ఎవరి ఆర్థిక హస్తం ఉందో తేలాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+