వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పదోన్నతుల పై ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. విజయవాడ లో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. నిరసనలకు అనుమతి లేక పోయినా.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ మేరకు పదోన్నతుల పైనా ఉత్తర్వులు జారీ చేసింది. కీలక అంశాలను వెల్లడించింది.
ఏపీలోని స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు (G.O.MS.No. 244) జారీ చేసింది. వార్డు సచివాలయ సిబ్బందికి ప్రమోషన్ ఛానెల్‌ను సుగమం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు నూతనంగా క్రియేట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది.

ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
కాగా.. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల ప్రమోషన్ల అనంతరం, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా పదోన్నతులను కల్పించింది. 815 వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను గ్రేడ్-Iగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను కూడా గ్రేడ్-I హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా ఈ పోస్టుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఏడేళ్లుగా సచివాలయ సిబ్బందిగా పనిచేస్తున్నా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు, సౌకర్యాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినా.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి రావటంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













Click it and Unblock the Notifications
