అదానీ పోర్ట్స్ రికార్డ్.. వంద శాతం గ్రీన్ ఎనర్జీతో ధామ్రా పోర్ట్ ఆపరేషన్స్!

దేశంలోని పెద్ద ప్రైవేట్ పోర్టులలో పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఒడిశాలోని ప్రముఖ ధామ్రా పోర్టు (Dhamra Port) ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి పునరుత్పాదక ఇంధన (Renewable Energy) ఆధారిత భారీ ప్రైవేట్ మల్టీ-కార్గో పోర్టుగా అవతరించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) నిర్వహిస్తున్న ఈ నౌకాశ్రయం.. తన పూర్తి విద్యుత్ అవసరాలను హరిత ఇంధనం ద్వారానే తీర్చుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది.

నెలవారీగా భారీ విద్యుత్ వినియోగం.. పూర్తిగా గ్రీన్ పవర్‌కే జై!

ప్రతిఏటా దాదాపు 4 కోట్ల 8 లక్షలకు పైగా టన్నుల కార్గోను ఈ పోర్టు నిర్వహిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఇటువంటి భారీ నౌకాశ్రయం తన విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా గ్రీన్ సోర్సెస్ వైపు మళ్లడం విశేషం. ప్రస్తుతం ఈ పోర్టు ప్రతి నెలా సుమారు 90 లక్షల యూనిట్ల విద్యుత్‌ను పూర్తిగా హరిత వనరుల నుంచే పొందుతోంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది సుమారు 108 గిగావాట్-గంటలకు పైగా ఉంటుందని అంచనా. కార్గో హ్యాండ్లింగ్, స్టోరేజ్, రైల్వే ఆపరేషన్స్ వంటి అన్ని కీలక కార్యకలాపాలు ఇప్పుడు క్లీన్ పవర్‌తోనే నిరంతరం సాగుతున్నాయి.

APSEZ s Dhamra Port Shifts To 100 Percent Green Energy Setting A New Benchmark For Indian Ports

నెట్-జీరో రోడ్‌మ్యాప్‌లో భాగంగానే ఈ విప్లవాత్మక మార్పు..

ఏపీఎస్‌ఈజెడ్ (APSEZ) నిర్దేశించుకున్న 'నెట్-జీరో' లక్ష్య సాధనలో భాగంగానే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 ఆగస్టు నుంచి ఈ విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇంధన వినియోగం అత్యధికంగా ఉండే ఇటువంటి భారీ పోర్టుల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, పర్యావరణ హితమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు చేసే విద్యుత్ ద్వారా వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించడమే ఈ బృహత్తర కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

వివిధ మార్గాల ద్వారా గ్రీన్ ఎనర్జీ సమీకరణ..

ధామ్రా పోర్టుకు అవసరమైన హరిత ఇంధనాన్ని ఏపీఎస్‌ఈజెడ్ వివిధ పద్ధతుల ద్వారా సమకూరుస్తోంది. గుజరాత్‌లోని ఖవ్డాలో ఉన్న తమ సొంత హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నుంచి దాదాపు నాలుగో వంతు నుంచి మూడో వంతు విద్యుత్ ఇక్కడికి వస్తోంది. మరో 10 నుంచి 15 శాతం విద్యుత్‌ను థర్డ్-పార్టీ ఒప్పందాల ద్వారా సేకరిస్తుండగా.. మిగిలిన అవసరాలను ఒడిశా విద్యుత్ పంపిణీ యుటిలిటీతో కుదుర్చుకున్న గ్రీన్ కన్స్యూమర్ ఒప్పందం ద్వారా తీర్చుకుంటున్నారు. ఈ సమగ్ర విధానం ద్వారా ధామ్రా పోర్టు పూర్తిగా పర్యావరణ అనుకూల నౌకాశ్రయంగా రూపాంతరం చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+