Commonwealth Games 2026: జ్ఞానేశ్వరికి సిల్వర్ మెడల్ -వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన భారత్.!

కటిక పేదరికం,తీరని ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రి కన్న కలలను అర్ధాంతరంగా చిదిమేశాయి.ఒకప్పుడు దేశం తరఫున గొప్ప బాడీబిల్డర్‌గా రాణించాలనుకున్న ఆయన,కుటుంబ పోషణ కోసం చివరికి ఒక సాధారణ ఎలక్ట్రీషియన్‌గా మారాల్సి వచ్చింది. కానీ,ఆయన నాటిన ఆశయాలు వృథా పోలేదు.కన్నకూతురు రూపంలో దేశ సరిహద్దులు దాటి విశ్వవేదికపై సాకారమయ్యాయి.కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం సాధించి,కన్నతండ్రి కళ్లలో అమూల్యమైన ఆనంద బాష్పాలు నింపింది.

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని ముద్దాడింది. మొత్తం 199 కేజీల బరువును ఎత్తి ఆమె రెండో స్థానంలో నిలిచి దేశానికి వెండి పతకాన్ని అందించింది.

commonwealth-games-2026-gyaneshwari-yadav-lifts-india-to-silver-scripts-history

పోటీలో నిలకడైన ప్రతిభ

మహిళల 53కేజీల వెయిట్‌ లిఫ్టింగ్ ఫైనల్ పోరులో జ్ఞానేశ్వరి ఒక్కసారి కూడా విఫలం కాకపోవడం గమనార్హం. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన ఆమె, క్లీన్‌ అండ్ జెర్క్‌లో 111 కేజీలను సులువుగా ఎత్తి తన విభాగంలో ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక నైజీరియాకు చెందిన ఒనోమే ఒమోలోలా మొత్తం 206 కేజీలు (స్నాచ్: 93 కేజీలు, క్లీన్‌ అండ్ జెర్క్: 113 కేజీలు) ఎత్తి కామన్వెల్త్ రికార్డుతో స్వర్ణ పతకం గెలుచుకోగా, కెనడా అథ్లెట్ రెబెకా గ్రౌల్క్స్ (178 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.

పాకిస్తాన్ కు భారత్ బిగ్ పంచ్- ఉక్కిరిబిక్కిరి: ఏకపక్షం
పాకిస్తాన్ కు భారత్ బిగ్ పంచ్- ఉక్కిరిబిక్కిరి: ఏకపక్షం

కష్టాలను జయించిన క్రీడాకారిణి

నిరుపేద కుటుంబం నుంచి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి,కేవలం ప్రతిభనే నమ్ముకుని విశ్వవేదికపై సత్తా చాటిన జ్ఞానేశ్వరి ప్రయాణం ఎందరో వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. తండ్రి త్యాగానికి, తన అసమాన శ్రమకు దక్కిన ఈ గొప్ప విజయం నేడు కోట్లాది మంది భారతీయుల గుండెలను తాకింది. ఈ విజయం భవిష్యత్తులో దేశానికి మరిన్ని గొప్ప విజయాలు సాధించడానికి ఆమెకు బాటలు వేస్తుంది.

Commonwealth Games 2026: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను!
Commonwealth Games 2026: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను!

జ్ఞానేశ్వరి సాధించిన ఈ రజతంతో ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. అంతకుముందు స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించగా, పురుషుల విభాగంలో రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా రజత పతకాలు సాధించారు.దీంతో పట్టికలో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉండగా..40 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+