ఇంకా దిగజారండి-జనసేనకు ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్..!


యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు మద్దతిస్తున్న తనపై కుల, మత ముద్రలు వేస్తూ విమర్శలకు దిగుతున్న జనసేన నాయకులు, మంత్రులు, ఇతర కూటమి పార్టీలు, కొన్ని మీడియా సంస్థలకు నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తనపై విమర్శల కోసం వారు దిగజారుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) వ్యాఖ్యానించారు. తాను మౌనంగా లేనని, అన్నీ చూస్తున్నానని ఆయన తెలిపారు.

Advertisement
Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!
Advertisement

ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ల ప్రభావంతో జన సైనికులు, కొందరికి అమ్ముడిపోయిన ఛానెల్‌లు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో అబద్ధాలు, అల్లుతున్న కాల్పనిక కథలు, బూతులు, అన్నీ వింటున్నానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మీ అందరికీ నా సమాధానం ఇంతే అన్నారు. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండని సూచించారు. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే అన్నారు. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోందిన్నారు. సో, దిగజారే సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి అంటూ ప్రకాశ్ రాజ్ చురకలు అంటించారు.

ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
Advertisement

కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి. నాలుగు వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి, దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి అంటూ ప్రకాష్ రాజ్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. మీరు ఇంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా, నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరని తేల్చేశారు. సో, కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి అన్నారు. చివరిగా మళ్లీ దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి, Just asking అంటూ ప్రకాశ్ రాజ్ తన వీడియో సందేశాన్ని ముగించారు.