కేంద్రం చెప్పిన తీపి కబురుకు ఉబ్బి తబ్బిబ్బైన సీఎం చంద్రబాబు
ఎప్పుడెప్పుడా అని విశాఖ వాసులు ఎదురు చూస్తున్న శుభవార్త చెప్పింది కేంద్రం. కేంద్రం చెప్పిన శుభవార్తతో ఏపీ పురోగతి సాధ్యం అవుతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసింది. విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని "సౌత్ కోస్ట్ రైల్వే జోన్" ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.
కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు అప్పటి నుండే
ఈ కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు 2026 జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వే వ్యవస్థలో ఇది 18వ జోన్‌గా గుర్తింపు పొందనుంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉండగా, విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్నం డివిజన్లు ఈ జోన్ పరిధిలో పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కొన్ని విభాగాలను పునర్వ్యవస్థీకరించి ఈ కొత్త జోన్‌ను రూపొందించారు.

చారిత్రక ఘట్టం అన్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు వారి ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. ప్రధాని Narendra Modi, కేంద్ర రైల్వే శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం మార్గాలను విశాఖ డివిజన్‌లో చేర్చడం ద్వారా ఉత్తరాంధ్రలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రం సమూలంగా
విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని 'దక్షిణ తీర రైల్వే జోన్'ను ఏర్పాటు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంతో హర్షణీయం అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ అధికారిక కార్యకలాపాలు జూన్ 1, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, పలాస-ఇచ్ఛాపురం వంటి కీలకమైన విభాగాలను విశాఖపట్నం డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రం సమూలంగా మారిపోనుందన్నారు.
ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఊతం
కొత్తగా ఏర్పడిన విశాఖపట్నం డివిజన్ మరియు రాయగడ డివిజన్ల మధ్య సమన్వయం ద్వారా రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని మన్నించి, ఈ చారిత్రాత్మక గెజిట్‌ను విడుదల చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.













Click it and Unblock the Notifications