మధ్యతరగతి ఉద్యోగులు భవిష్యనిధి (EPF)తో పాటు ప్రజా భవిష్య నిధి(PPF)లో కూడా తమ డబ్బుల్ని దాచుకుంటుంటారు. అయితే ఇలా వారు దాచుకునే డబ్బుల పరిమితిని కేంద్రం ఏడాదికి లక్షన్నరగా మాత్రమే ఉంచింది. అంతకు మించి ఉంటే దానికి తగినట్లుగా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఎప్పటి నుంచో అలాగే ఉంచేసింది. దీనిపై కేంద్రానికి పలు విజ్ఞప్తులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కేంద్రానికి కీలక ప్రతిపాదన చేశారు.
మోదీజీ.. వాళ్లను మీరు ఆపాలంటే..! సాయిరెడ్డి కీలక సలహా..!
కీలకమైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టే పెట్టుబడుల పరిమితిని పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. అలాగే ఈ పరిమితి పెంపు అవసరం, కారణాలను కూడా ఆయన ఆర్దిక మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా కారణాలతో పీపీఎఫ్ వార్షిక పెట్టుబడి పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్షన్నర రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచాలని సాయిరెడ్డి కోరారు.
సాయిరెడ్డి తన ట్వీట్ లో "ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, 2014 నుండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో వార్షిక పెట్టుబడి పరిమితి ₹1.5 లక్షల వద్దే స్థిరంగా ఉంది. ఇది దీర్ఘకాలిక, సురక్షితమైన పొదుపును నిరుత్సాహపరచడమే కాకుండా, అనేక కుటుంబాలను అధిక రిస్క్ ఉన్న పెట్టుబడి మార్గాల వైపు మళ్ళేలా చేస్తోంది. కోట్లాది మంది భారతీయులు తమ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసుకునేందుకు ఒక బలమైన మరియు సురక్షితమైన మార్గాన్ని కల్పించేలా, PPF పరిమితిని కనీసం ₹2.5 లక్షలకు పెంచాలని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరుతున్నాను." అని తెలిపారు.ఐటీ రిటర్న్ లో భార్యా భర్తల ఆఫర్..! నిర్మలమ్మకు సాయిరెడ్డి డిమాండ్..!