అందుకే స్టాలిన్ కు గుడ్ బై..! అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్..!

తమిళనాడులో ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (Vijay) టీవీకేకు వ్యతిరేకంగా డీఎంకే-అన్నాడీఎంకే కూటములు జట్టు కట్టబోతున్నాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఢిల్లీలో కేజ్రివాల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్-బీజేపీ ఇలాంటి ప్రయత్నాలే చేసి నిండా మునిగాయి. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే-అన్నాడీఎంకే కూటములకు అదే గతి పట్టబోతోందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం కాంగ్రెస్ (Congress) కు ముందే తెలుసని ఎంపీ మాణిక్కం ఠాకూర్ (Manickam tagore) వెల్లడించారు.

విజయ్ కోసం సొంత పార్టీపై కస్తూరి తిరుగుబాటు..! కుట్ర, నీచమైన ఆట..!
విజయ్ కోసం సొంత పార్టీపై కస్తూరి తిరుగుబాటు..! కుట్ర, నీచమైన ఆట..!

రెండు ద్రావిడ పార్టీలు, చిరకాల శత్రువులు, రాత్రికి రాత్రే ఒక్కటయ్యారు, తమిళనాడు కోసం కాదు, లౌకికవాదం కోసం కాదు,
ఒక్క వ్యక్తిని, విజయ్‌ను ఆపడానికి అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ట్వీట్ చేసారు. కాంగ్రెస్ దీన్ని స్పష్టంగా గమనించి
బయటకు వెళ్లిపోయిందని ఆయన వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీల బి-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరని స్టాలిన్ కు ఆయన చురకలు అంటించారు.

Before DMK-AIADMK United Against Vijay Congress Walked Out Manickam Tagore Finally Tells Why

Congress-TVK Alliance: కాంగ్రెస్-విజయ్ బంధం ఈనాటిది కాదా ? వైరల్ ఫొటో..!
Congress-TVK Alliance: కాంగ్రెస్-విజయ్ బంధం ఈనాటిది కాదా ? వైరల్ ఫొటో..!

"స్థిరమైన ప్రభుత్వం" అనేది తమ అధికారాన్ని కాపాడుకుంటున్న రెండు భయపడిన పార్టీల రాజకీయ భాష అని మాణిక్కం ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ సరైన పనే చేసిందని, డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా? ఎవరు ద్రోహి ? అంటూ కాంగ్రెస్ ఎంపీ డీఎంకేకు చురకలు అంటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఊహించిన దాని కంటే తీవ్రంగా మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని విజయ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+