డీలిమిటేషన్-మహిళా బిల్లు కోసం ఆ 2 బిల్లులు వెనక్కి ? కేంద్రం మరో సంచలనం..!


గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం (Centre) డీలిమిటేషన్-మహిళా బిల్లును నెగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. పార్లమెంట్ లో 2/3 వంతు మెజార్టీ తప్పనిసరి అని తెలిసి కూడా విపక్షాల్ని చీల్చేందుకు విఫలయత్నం చేసింది. చివరికి ఆ బిల్లులు గట్టెక్కకపోవడంతో ఆ తర్వాత మరింత దూకుడుగా విపక్షాల్ని చీల్చేపనిలో పడింది. ఇందులో చాలా వరకూ విజయం సాధించింది కూడా. దీంతో ఇప్పుడు డీలిమిటేషన్ - మహిళా బిల్లును నెగ్గించుకునేందుకు భారీ ప్లాన్ చేస్తోంది.

Advertisement
మోదీజీ.. వాళ్లను మీరు ఆపాలంటే..! సాయిరెడ్డి కీలక సలహా..!
Advertisement

ఇందులో భాగంగా ఈ కీలకమైన డీలిమిటేషన్- మహిళా బిల్లుకు ప్రాంతీయ పార్టీల బేషరతు మద్దతు సాధించుకునే క్రమంలో అడ్డుపడతాయని భావిస్తున్న ఇతర బిల్లుల్ని ఏదో రకంగా పక్కనబెట్టేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్దం చేసిన రెండు బిల్లుల్ని కేంద్రం తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక వివాదాస్పద బిల్లు 'విక్సిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ పై వచ్చే సోమవారం జరగాల్సిన సంయుక్త కమిటీ సమావేశం రద్దు చేసింది. ఈ సమావేశంలో ఈ బిల్లుపై నివేదికను ఆమోదించాల్సి ఉంది.

సోనమ్ కు మద్దతుగా దీక్షల్లోకి బెంగళూరు స్టూడెంట్స్- ప్రకాశ్ రాజ్ ప్రకటన..!
Advertisement

తీవ్రమైన నేరాలకు అరెస్టు అయిన మంత్రులను వరుసగా 30 రోజుల పాటు తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నివేదిక ఆమోదాన్ని పార్లమెంట్ సంయుక్త కమిటీ వాయిదా వేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ బిల్లుల అమలును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రాంతీయ, చిన్న పార్టీల మద్దతును కూడగట్టేందుకే ఈ రెండు వివాదాస్పద బిల్లులకు సంబంధించిన ప్రతిపాదిత చట్టాలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మోడీ బిగ్ ప్లాన్ ? ఒకటే ఎన్సీపీ..! తర్వాతే ఎన్డీయేలోకి..!