డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పై DMK ఊహించని నిర్ణయం, ఇక నెక్స్ట్..!!

ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లుల ప్రతిపాదన.. ఆమోదం దిశగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. గత సమావేశాల్లో వీగిన బిల్లులను పూర్తి మెజార్టీతో ఆమోదించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే టీఎంసీ, ఎన్సీపీ, శివసేన చీలక ఎంపీల మద్దతుతో ఎన్డీఏ బలం పెరిగింది. కాగా, తాజాగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ నిర్ణయం అంతు చిక్కటం లేదు. భవిష్యత్ లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ సారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు- నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లు కీలకం కానున్నాయి. ఈ బిల్లుల ఆమోదానికి కావాల్సిన పూర్తి మెజార్టీ కూడగట్టే పనిలో ఎన్డీఏ నిమగ్నం అయింది. కావాల్సిన మెజార్టీకి వీలుగా ఎంపీల ను కూడగట్టింది. టూ థర్డ్ మెజార్టీ అవసరం కావటంతొ.. ఆ దిశగా తుది కసరత్తు జరుగుతోంది. టీఎంసీ, ఎన్సీపీ, శివసేన చీలక ఎంపీల మద్దతుతో ఈ బిల్లును పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన డీఎంకే ఇప్పుడు ఆ కూటమికి సహకరించటం లేదు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో స్టాలిన్ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో సంబంధం లేకుండా ... రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

 వారిని వదులుకోవటానికీ సిద్దం, సర్వేల్లో తేలిందిదే - చంద్రబాబు..!!
వారిని వదులుకోవటానికీ సిద్దం, సర్వేల్లో తేలిందిదే - చంద్రబాబు..!!
dmk-latest-decision-to-study-delimitation-bill-on-merit-says-it-will-safeguard-tamil-nadus-intere

డీఎంకే నిర్ణయం.. కాంగ్రెస్ కు షాక్

కాగా, ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్‌లో గళమెత్తాలని డీఎంకే అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలతో విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. 'తమిళనాడు ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లో మన ఎంపీలు గళం విప్పాలి. రాష్ట్ర హక్కులను, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించాలని పార్టీ ఎంపీలకు తేల్చి చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత... దానిలోని లోటుపాట్లు, నిబంధనలను పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని డీఎంకే నిర్ణయానికి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా ఏమాత్రం తగ్గకుండా పాత నిష్పత్తినే కొనసాగించాలనే ప్రతిపాదనపై కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డీఎంకే నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+