కర్ణాటకలో ఇకపై రెండో అధికార భాష..: ఆ జిల్లా పేరు మార్పు- మంగళూరులో మంత్రివర్గ భేటీ

కర్ణాటకలో స్థానిక ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. మంగళూరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాదాపు రూ. 32,611 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు వెలుపల.. ముఖ్యంగా తీరప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మంగళూరులో కేబినెట్ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షత వహించారు. మంత్రివర్గ సహచరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తల నుంచి అందిన వివిధ వినతులను మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలించింది. పలు తీర్మానాలను ఆమోదించింది.

Tulu Granted Second Official Language in Karnataka as Dakshina Kannada and Udupi Major Coastal Win

కర్ణాటక తీరప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చింది కేబినెట్. తుళు భాషకు అధికారిక హోదా కల్పించంది. తుళును కర్ణాటక రెండవ అధికారిక భాషగా గుర్తించింది. దీనికి అవసరమైన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో తుళునాడు ప్రజల ఆకాంక్ష నెరవేరింది.

పంచ ద్రావిడ భాషల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.. తుళుకు. దాదాపు 2,000 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక కోటి మందికి పైగా ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం తుళుకు రెండవ అధికారిక భాషా హోదా కల్పించవచ్చని గతంలో డాక్టర్ మోహన్ ఆళ్వా నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా తాజా నిర్ణయం తీసుకుంది కేబినెట్.

దీనివల్ల తీరప్రాంత ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడతో పాటు తుళు భాషను కూడా అధికారికంగా ఉపయోగించే వీలు కలుగుతుంది. భాషా గుర్తింపుతో పాటు తీరప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా దక్షిణ కన్నడ జిల్లా పేరును మంగళూరు జిల్లాగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను సేకరించి, నెల రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే మలెనాడు, తీరప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం నూతన పర్యాటక విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

తీరప్రాంతంలోని సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. శిథిలావస్థకు చేరిన దేవాలయాలు, మఠాల పునరుద్ధరణ కోసం రూ.12 కోట్లు కేటాయించారు. ఇందులో పుత్తూరు మహాలింగేశ్వర దేవాలయానికి రూ.5 కోట్లు, ఒడియూరు, మాణిల మఠాలకు తలా రూ.కోటి చొప్పున నిధులు అందుతాయి. ఉల్లాల్ సయ్యద్ మదనీ జుమ్మా మసీదుకు రూ.5 కోట్లతో పాటు చర్చిలకు సహాయం ప్రకటించారు. కంబళ గ్రాంట్‌ను రూ.40 లక్షల నుంచి కోటికి పెంచడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+