CTET 2026: సీటెట్ పరీక్ష తేదీ ఖరారు- పరీక్ష విధానం, అర్హత మార్కులు ఇలా..!

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలని ఆశిస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు కేంద్ర ప్రాథమిక బోర్డు ( CBSE) నిర్వహించి అర్హత పరీక్ష సీటెట్ (CTET 2026)పై కీలక ప్రకటన వెలువడింది. 22వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్ష తేదీలను సీబీఎస్ఈ అధికారికంగా విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్షను డిసెంబర్ 12, 13 తేదీలలో దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది.

సీబీఎస్‌ఈ ఆఫ్‌లైన్ విధానంలోనే (పెన్ అండ్ పేపర్) ఈ పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా నగరం, పరీక్ష తేదీ తదితర ప్రాథమిక వివరాలను పరీక్షకు 15 రోజుల ముందే అధికారిక సీటీఈటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. అయితే, పరీక్షా కేంద్రాన్ని సూచించే పూర్తి స్థాయి అడ్మిట్ కార్డులను మాత్రం పరీక్ష తేదీకి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.

CTET 2026 Exam Date Out Check Schedule Exam Pattern Qualifying Marks and More

సీటీఈటీ పరీక్షను అభ్యర్థులు తాము బోధించాలనుకునే తరగతుల ఆధారంగా రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. అలాగే ఉన్నత ప్రాథమిక తరగతుల్లో, అంటే ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 పరీక్షకు హాజరు కావాలి. అభ్యర్థులు తమ విద్యార్హతలను బట్టి పేపర్‌ను ఎంచుకోవాలి. పేపర్-1, పేపర్-2 రెండింటిలోనూ ఐదేసి విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌లోనూ మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మార్కులు 150. ఈ పరీక్ష రాయడానికి అభ్యర్థులకు రెండు గంటల ముప్పై నిమిషాల సమయం ఇస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు కనీసం 90 మార్కులు (అంటే 60 శాతం ) సాధించడం తప్పనిసరి. కేంద్రీయ విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయాలు (NVS) తో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వివిధ ప్రతిష్టాత్మక పాఠశాలల్లో టీచర్‌గా ఉద్యోగం పొందడానికి ఈ పరీక్షలో స్కోర్ కీలకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+