AP ITI Recruitment 2026: ఏపీ ఐటీఐల్లో ఉద్యోగాలు- బీటెక్, ఎంసీఏ, బీసీఏ అర్హతలు..!

ఏపీలో బీటెక్, ఎంసీఏ, బీసీఏ విద్యార్హతలు ఉండి నిరుద్యోగులుగా ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వ ఐటీఐల్లో ఈ విద్యార్హతలతో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ (AP ITI Recruitment 2026) విడుదల చేసింది. ఏలూరు, భీమవరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఐటీఐల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆయా ఐటీఐల్లో ఉపాధి, శిక్షణ శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉమ్మడిగా ఏఐ డేటా, ఏఐ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.

Jobs: నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు-భారీ జీతాలు-ఈ రంగంలో ట్రై చేశారా ?
Jobs: నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు-భారీ జీతాలు-ఈ రంగంలో ట్రై చేశారా ?

కాంట్రాక్టు విధానంలో ఈ ఐదు ఐటీఐల్లో డేటా ఆనటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వీలుగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మూడు పోస్టులకు విద్యార్హతలు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించారు. కాంట్రాక్టు విధానంలో 5 డేటా అన్నోటేటర్, 5 డేటా క్యూరేటర్, 10 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు కాకినాడ ప్రాంతీయ ఉప సంచాలకుడు మురళీధర్ తెలిపారు. ఔత్సాహికులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు https://govtitikakinada.org వెబ్ సైట్ సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

AP ITI Recruitment 2026 Data Annotator Data Curator Lab Assistant Vacancies Announced
Data Centre Jobs: డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు రావా? తేల్చేస్తున్న నిపుణులు..!
Data Centre Jobs: డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు రావా? తేల్చేస్తున్న నిపుణులు..!

ఈ పోస్టుల భర్తీ కోసం ముందుగా అవసరమైన అర్హతలు, సంబంధిత అనుభవం, వయస్సు, రిజర్వేషన్, సర్టిఫికేషన్ ల ప్రాథమిక పరిశీలన ఉంటుంది. అనంతరం అకడమిక్ వెయిటేజ్, సంబంధిత అనుభవం, డొమైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ప్రాక్టికల్ ప్రదర్శన, బోధనా ప్రదర్శన, ఇంటర్వ్యూలను మూల్యాంకనానికి ముందు తెలియజేస్తారు.ట్రైనర్ల కోసం (డేటా అనోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్) ప్రాక్టికల్/బోధనా ప్రదర్శనలో పైథాన్, ఏఐ/డేటా భావనలు, కోర్సుకు సంబంధించిన టూల్స్, పాఠ్య ప్రణాళిక, కమ్యూనికేషన్ మరియు బాధ్యతాయుతమైన ఏఐ/డేటా గోప్యతా అవగాహనను అంచనా వేస్తారు.ల్యాబ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) ప్రాక్టికల్ టెస్ట్‌లో సిస్టమ్ సెటప్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ట్రబుల్షూటింగ్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, యూజర్ మేనేజ్‌మెంట్, బ్యాకప్‌లు, ప్రయోగశాల భద్రతను అంచనా వేస్తారు. ఈ పోస్టులకు రిజర్వేషన్లు కూడా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+