అంగన్వాడీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక అప్డేట్!

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణా సర్కార్ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపైన కూడా పూర్తిగా దృష్టి సారిస్తోంది. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 15,982 టీచర్ మరియు హెల్పర్ పోస్టులను భర్తీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో తెలంగాణ​ అమ్మాయి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్‌ చేసిన పోలీసులు
అమెరికాలో తెలంగాణ​ అమ్మాయి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్‌ చేసిన పోలీసులు

వేలాది మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశం

సెప్టెంబర్‌ నాటికి భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వేలాది మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశం కల్పించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రాలలో నియామకాలను జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. జోన్-1 పరిధిలో 1,853 టీచర్ పోస్టులు, 7,737 ఆయా పోస్టులు ఉన్నాయి.

Telangana Anganwadi Recruitment 2026 govt orders filling of 15 982 Anganwadi Teacher and Helper posts by end of September

అంగన్వాడీ కేంద్రాలలో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ

జోన్-2లో 1,247 టీచర్, 5,145 ఆయా పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ కేంద్రాలలో ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్‌లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ కేటాయించారు. ఇంటర్వ్యూకు 10 శాతం మార్కులు ఉన్నాయి. వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక వెయిటేజీ కల్పించనున్నారు.

తెలంగాణ శాసనమండలిలో అనూహ్య పరిణామం: ఎకాఎకిన ఎమ్మెల్సీపై వేటు వేసిన పార్టీ
తెలంగాణ శాసనమండలిలో అనూహ్య పరిణామం: ఎకాఎకిన ఎమ్మెల్సీపై వేటు వేసిన పార్టీ

సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో నియామక ప్రక్రియను వేగవంతం చేసి సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీలను బలోపేతం చేయటం ద్వారా తల్లులకు, పిల్లలకు మేలు చేకూర్చనుంది. ఈ క్రమంలో అంగన్వాడీల పోస్టుల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి

అర్హత ఉన్న మహిళలు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లు లేదా wdcw.tg.nic.in ద్వారా వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ భారీ నియామకం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మెరుగుపరచడంతో పాటు మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించే దిశగా ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఆసక్తి ఉన్న అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+