India Post GDS Recruitment 2026: టెన్త్ పాస్ తో పోస్టాఫీసుల్లో 23757 జాబ్స్-వివరాలివే..!

కేవలం పదో తరగతి అర్హతతో, ఎలాంటి పరీక్షలు కూడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 23757 ఉద్యోగాల భర్తీ కోసం తపాలా శాఖ ఇవాళ నోటిఫికేషన్ (India Post GDS Recruitment 2026 Notification) విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, సర్కిళ్ల పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా ఎంపిక చేస్తారు.. ఇలా అన్ని వివరాలను కూడా తపాలాశాఖ విడుదల చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

ఇంటర్న్‌షిప్‌కు నెలకు 30 లక్షల జీతమా? ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊహించని భారీ ఆఫర్స్..!
ఇంటర్న్‌షిప్‌కు నెలకు 30 లక్షల జీతమా? ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊహించని భారీ ఆఫర్స్..!

పోస్టల్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈసారి కూడా మూడు కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, సర్కిళ్ల పరిధిలో ఈ మూడు ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. వీటికి అర్హత కేవలం పదో తరగతి మాత్రమే. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ మూడు ఉద్యోగాలకూ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, దివ్యాంగ ఓబీసీలు అయితే 13 ఏళ్లు, దివ్యాంగ ఎస్సీ, ఎస్టీలుంటే 15 ఏళ్లు మినహాయింపు ఇస్తారు.

India Post GDS Recruitment 2026 Notification Released for 23 757 Posts Check State-Wise Vacancies
Data Centre Jobs: డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు రావా? తేల్చేస్తున్న నిపుణులు..!
Data Centre Jobs: డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు రావా? తేల్చేస్తున్న నిపుణులు..!


ఈ ఉద్యోగాల్లో జీడీఎస్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24, 470 వరకూ వేతనం ఉంటుంది. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు 12 వేల నుంచి 29,380 వరకూ వేతనాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు యూజర్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్ధులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం ఉద్యోగాల దరఖాస్తుల కోసం అప్లికేషన్ విండో సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకూ తెరిచి ఉంచుతారు. దరఖాస్తుల్లో పొరబాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అవకాశం కల్పిస్తారు. రాష్ట్రాల వారీగా ఖాళీలు, మరిన్ని వివరాల కోసం www.indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. లేకపోతే స్దానిక పోస్టాఫీసుల్ని సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+