CBSE సరికొత్త రూల్స్.. ఆ పరీక్షకు బోర్డు ఎగ్జామ్స్ లేవు!

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) సిఫార్సుల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్రిభాషా విధానం (Three-Language Scheme) అమలుపై సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాబోయే విద్యా సంవత్సరం (2026-27) నుంచి 9వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులందరూ తప్పనిసరిగా మూడు భాషలను చదవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మూడో భాష (R3) విషయంలో ఎలాంటి బోర్డు పరీక్షలు ఉండబోవని స్పష్టం చేసింది.

బోర్డు పరీక్షలు లేవు.. కేవలం స్కూల్ ఎగ్జామ్స్ మాత్రమే!

సీబీఎస్‌ఈ తాజా సర్క్యులర్ ప్రకారం.. విద్యార్థులు ఎంచుకునే మూడో భాష (R3) కు కేవలం పాఠశాల స్థాయిలోనే ఇంటర్నల్స్ (Internal School-Based Assessment) నిర్వహిస్తారు. 10వ తరగతి పూర్తిచేసే బ్యాచ్ వరకు కూడా ఈ మూడో భాషకు ఎలాంటి అధికారిక సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఉండవు.

CBSE Third Language R3 Guidelines No Board Exam but School-Based Internal Assessment From 2026-27

ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా?

ఈ సరికొత్త విధానంలో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా బోర్డు కొన్ని సడలింపులను ఇచ్చింది. 9వ తరగతిలో మూడో భాష (R3) ఇంటర్నల్ పరీక్షల్లో క్వాలిఫై కాకపోయినా.. విద్యార్థిని 10వ తరగతికి ప్రమోట్ చేస్తారు. అయితే, సదరు విద్యార్థి 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆ మూడో భాషను ఖచ్చితంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ సెకండరీ పాస్ సర్టిఫికేట్ (10వ తరగతి పాస్ సర్టిఫికేట్) అందుకోవాలంటే మూడో భాషలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఒకవేళ 10వ తరగతి ఇంటర్నల్స్‌లో కూడా మూడో భాషలో ఫెయిల్ అయితే, ఫైనల్ ఫలితాలు ప్రకటించడానికి ముందే సదరు విద్యార్థికి మరోసారి పరీక్ష (Re-assessment) రాసే అవకాశాన్ని కల్పిస్తారు.

CBSE విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు
CBSE విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు

మూడు భాషల ఎంపిక ఎలా ఉండాలి?

2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివే ప్రతి విద్యార్థి మూడు భాషలను నేర్చుకోవాలి. ఇందులో కనీసం రెండు భాషలు భారతీయ భాషలై (Bhartiya Bhashas) ఉండాలి.

  • ఆప్షన్ 1: మొదటి రెండు భాషలుగా హిందీ, తమిళం ఎంచుకుంటే.. మూడో భాషగా ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ వంటి విదేశీ భాషను చదువుకోవచ్చు.
  • ఆప్షన్ 2: ఒకవేళ మొదటి రెండు భాషలుగా తమిళం, ఇంగ్లీష్ ఎంచుకుంటే.. మూడో భాష (R3) గా ఖచ్చితంగా ఏదైనా ఒక భారతీయ భాషనే ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • పాత బ్యాచ్‌కు మినహాయింపు: ప్రస్తుతం (2026-27 విద్యా సంవత్సరంలో) 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాత పద్ధతిలోనే రెండు భాషలను చదువుతారు, వీరికి మూడో భాష నిబంధన వర్తించదు.
CBSE 7,8,9 10 క్లాసుల విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇకపై భాషల ఎంపిక ఇలా..!
CBSE 7,8,9 10 క్లాసుల విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇకపై భాషల ఎంపిక ఇలా..!

ఈ వినూత్న విధానం ద్వారా విద్యార్థులు ఒత్తిడి లేకుండా బహుళ భాషలపై పట్టు సాధించేందుకు వీలవుతుందని బోర్డు విశ్వసిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+