విదేశాలకు మరోసారి జగన్ - సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి యూపర్ పర్యటనకు వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరారు. తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసారు. 15 రోజుల పాటు జగన్ యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ పిటీషన్ పైన విచారణ చేసిన సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. స్థానిక ఎన్నికల వేళ జగన్ విదేశీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 లోపు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ కొన్ని షరతులు విధించింది. యూరప్ పర్యటనకు వెళ్లే దు సీబీఐ కోర్టు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన సమయంలో అందుబాటులో ఉండే కాంటాక్ట్ నంబర్, ఈ-మెయిల్ సీబీఐ అధికారులకు ఇవ్వాలని ఆదేశాల్లో కోర్టు స్పష్టత ఇచ్చింది. కుటుంబంతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటించేందుకు దాదాపు 25 రోజుల సమయం కావాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నందున జగన్ విదేశాలకు వెళ్లాలంటే ప్రతిసారి కోర్టు అనుమతి తప్పనిసరి. ఆయన పాస్‌పోర్ట్ ప్రస్తుతం కోర్టు స్వాధీనంలోనే ఉంది.

స్థానిక ఎన్నికల వేళ విదేశాలకు జగన్
జగన్ కుమార్తెలు ఇద్దరూ లండన్‌లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి, అక్కడే స్థిరపడ్డారు. గతంలో వారి గ్రాడ్యుయేషన్ డే కోసం కూడా జగన్ లండన్ వెళ్లి వచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతి రావటంతో.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా టూర్ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోసం జగన్ రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని, పర్యటన ముగించుకుని వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్న ప్రధాన షరతుతో జగన్ విదేశీ ప్రయాణానికి మార్గం సుగమమైంది. దీంతో. .. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీ నేతలతో చర్చించి.. టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
