ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో దానం పోటీ చేయొచ్చా ? చట్టం ఏం చెబుతోంది?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ లోకి ఫిరాయించడమే కాకుండా, గత లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్ధానం నుంచి కాంగ్రెస్ బీఫారంతో పోటీ చేసి దొరికిపోయి అనర్హత వేటు పడిన దానం నాగేందర్ పరిస్ధితి ఎలా మారబోతోంది ?, తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం దానం నాగేందర్ పై అనర్హత వేటు ఖరారైంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ కోర్టులో చెప్పిన దానం.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లబోనని తేల్చిచెప్పేశారు. అయితే ఇప్పుడు దానంపై వేటుతో ఖాళీ అయిన ఖైరతాబాద్ అసెంబ్లీ స్ధానానికి త్వరలో జరిగే ఉపఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది.

అంబటికి ఈడీ విచిత్ర నోటీసు..! 11న రమ్మని..! అంబటి రాయుడు పేరు రాయించి..!
అంబటికి ఈడీ విచిత్ర నోటీసు..! 11న రమ్మని..! అంబటి రాయుడు పేరు రాయించి..!

దానం నాగేందర్ పై (Danam Nagender) రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించినందుకు అనర్హత వేటు వేసింది. ఈ కారణంతో అనర్హత వేటు వేస్తే తిరిగి తదుపరి జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన ఏదీ లేదు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఆయనపై ఆరేళ్ల పాటు అనర్హత వేటు పడినట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. అందుకే ఆయన హైకోర్టు తీర్పు తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.

Can Danam Nagender Contest Khairatabad Bypoll After HC Disqualification What the Law Says
ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..!
ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..!

తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని కూడా తేల్చిచెప్పేశారు. అలాగే ప్రజా క్షేత్రంలో, ఎన్నికల్లో కొట్లాడతానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదని దానం స్పష్టం చేశారు. పోరాటాలు చేసే ఈ స్థాయికి వచ్చానని, ఎన్నికలు వస్తే ప్రజా క్షేత్రంలో పోరాడతానంటూ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని పరోక్షంగా ఆయన వెల్లడించారు. దీంతో ఖైరతాబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లో దానంను గెలిపించుకోవాల్సిన పరిస్ధితి రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎదురుకాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+